Anna Raghu, Guntur, News18. Grandma Birthday Celebrations: ఈ రోజుల్లో 40 ఏళ్లు దాటితే చాలు ఎన్నో ఆరోగ్య సమస్యులు. కాలు తీసి బయట పెట్టాలంటే భయం.. అరకిలోమీటరు నడాలి అంటే ఆపసోపాలు పడాలి.. పది నిమిషాలు కూర్చోలేరు.. ఒక్క నిమిషం నిలబడలేరు... కానీ ఆ బామ్మ వయసు 111 ఏళ్లు అయినా ఇప్పటికే ఫిట్ గానే ఉంటోంది.
అప్పట్లో జాతి పిత గాంధీ తెనాలి వచ్చారని తమ ఊరి నుండి గాంధీని చూడటానికి బండ్లు కట్టుకుని వెళ్లారని ఆమె స్వాతంత్రోద్యమం నాటి రోజులను గుర్తు చేసుకుంటున్నారు. ఆ రోజుల్లో ప్రతి ఒక్కరిలోనూ దేశ భక్తి ఉండేదని.. అలాగే గాంధీని సైతం అమింతగా ఇష్టపడేవారని.. గుంటూరు నుంచి ఆయన వెంట చాలామంద నడిచారని ఆమె గుర్తు చేస్తున్నారు.
మాజీ మంత్రి దివంగత నేత అనగాని భగవంతరావు గారి అన్న కుమార్తె జున్ను వెంకట సుబ్బమ్మ 110 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో పుట్టినరోజు వేడుకలను ఆమె కుటుంబసభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ పుట్టినరోజు వేడుకలు ఏపీలోని గుంటూరు జిల్లాలో జరిగాయి. జిల్లాలోని చెరుకుపల్లి మండలం పడమటి పాలెం రాజవోలులో వేడుకలు సందడిగా సాగాయి. ఆమె 1911 జనవరి 16 న జన్మించారు.
వెంకటజన్ను వెంకట సుబ్బమ్మ 111వ పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులు చాలా ఘనంగా నిర్వహించారు. పండుగనాడే ఆమె పుట్టిన రోజు కావడంతో ఆ సందడి రెట్టింపు అయ్యింది. పిల్లలు, మనవలు, మునిమనవలు అంతా కలిసి ఆమెతో కేక్ కట్ చేయించారు. దీంతోపాటు భోజనాలు సైతం ఏర్పాటు చేశారు. దీంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.
మొత్తం ఐదు తరాలకు చెందిన కుటుంబ సభ్యులను చూసిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే ఆమె ఇత ఆరోగ్యంగా ఉండడానికి ఆహారపు అలవాట్లు. జీవన శైలే కారణమంటున్నారు. ముఖ్యంగా జొన్న రాగులు చేపలు తన ఆహారంలో తీసుకుంటుంది రోజుకు ఒకపూట మాత్రమే భోజనం చేస్తుంది. సాయంత్రం ఉదయం పలు స్వీకరిస్తుందని ఇదే తన ఆరోగ్యరహస్యం అని చెపుతుంది జున్ను వెంకట సుబ్బమ్మ.. అంతేకాదు ఇప్పటికే ఆమె పనులు ఆమె చేసుకుంటారు.
ఇప్పటికి ఎంతో ఆరోగ్యంగా హుషారుగా ఉంటుందని తనకు ఊహ తెలిసినప్పటినుండి ఇప్పటివరకు ఆమె ఒక్క మందు బిళ్ళ కూడా వేసుకోలేదని చెపుతున్నాడు కొడుకు మనుమడు 40 ఏళ్ల జున్ను వెంకటశివరావు. ఆమె ఆహారపు అలవాట్ల కారణంగానే ఆమె ఇప్పటికీ ఎంతో చలాకీగా ఉంటూ ఆమె పనులు ఆమె చేసుకోవడమే కాకుండా ఇంటి పనుల్లోనూ సాయం చేస్తూ ఉంటుందని కుటుంబసభ్యులు వెల్లడించారు.
సామాజిక చైతన్యం కూడా బాగానే ఉంది. ఇప్పటి వరకు ఆమె ఒక్కసారి కూడా ఓటు హక్కు వినియోగించకుండా ఉండలేదు. ఎలాంటి సందర్భంలోనైనా ఓటు వేస్తుంది. ప్రజాస్వామ్య రక్షణలో భాగంగా అందరూ ఓటు వేయాలని కనిపించిన వారికి ఆ భామ్మ చెబుతుంది కూడా అంటున్నారు. ఆ గ్రామంలో వెంకటసబ్బమ్మ అంటే చాలా గౌరవిస్తారని.. ఆమె గతంలో చాలామందికి సహాయ పడ్డారని చెబుతూ ఉంటారు. అందుకే ఆమె పుట్టిన రోజు వేడుకను గ్రామ సభ్యులంతా ఘనంగా జరుపుకున్నారు. ఆమె కుటుంబంలోని మొత్తం 97 మంది పాల్గొనడం విశేషం.