Demand for Dry Fruits in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో ప్రస్తుతం డ్రై ఫ్రూట్స్.. ఇంక మటన్ కైమాకు ఊహించని ధర పెరిగింది. వాటికి ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. అలాగని వాటిని తినే వారి సంఖ్య ఎప్పటిలానే ఉంది.. కానీ డిమాండ్ పెరిగింది.. దారిని కారణం ఏంటో తెలుసా కోడి పందాలే.. కోడి పందాలకు ఫుడ్ కు ఏంటి సంబంధం అనుకుంటున్నారా..?
సాధారణంగా సంక్రాంతి పండుగ అంటే.. అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది కోడి పందేలు మాత్రమే. భోగి మంటలు, ముత్యాల ముగ్గులు, డూ డూ బసవన్నలు, ఆటలు, హరిదాసు కీర్తనలు... వీటన్నింటి మంచి సందడి నింపేవి.. పండగకి ప్రత్యేక గుర్తింపు తెచ్చేవి కోడి పందేలు అనడంలో ఎలాంటి సందేహం లేదు... అందుకే ఎన్ని ఆంక్షలు ఉన్నా.. ఎన్ని కేసులు పెడుతున్నా.. పందాలు ఆగవు..
సంక్రాంతి పండగ వచ్చిందంటే పల్లెల్లో కోడి పందేల జోరు అంతా ఇంతా కాదు. అయితే ఈ పండుగకు కోడి పందేల బరిలో దిగేందుకు కోళ్లను 5 నెలల ముందు నుంచే రెడీ చేస్తుంటారు. అయితే ఈ కోడి పందేలకు లక్షల్లో ఖర్చు ఉంటుంది పందెం రాయుళ్లకు.. ఇవి బలంగా తయారై బరిలో ప్రత్యర్థితో పోటీకి సై అనాలి అంటే.. ఇంత బలమైన ఆహారం పెట్టాల్సిందే.
ఇలా గత ఐదు నెలలుగా పందెం కోళ్ల కోసం.. వాటి యజమానాలు భారీగా డ్రై ఫ్రూట్స్ తో పాటు.. మటన్ కైమాను కొనుగోలు చేసి తమ కోళ్లకు ఆహారంగా పెడుతున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోనూ ఈ కోళ్ల పెంపకం భారీగా జరుగుతోంది. దీంతో వాటికోసం ప్రత్యేకంగా డ్రైఫ్రూట్స్ కొనుగోలు చేస్తున్నారు.. దీంతో వాటికి విపరీమైన డిమాండ్ పెరిగింది.
వాటి కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు పందె కోళ్ల ను పెంచే యజమానులు.. పుంజులపై భారీగా పెట్టుబడులు పెట్టి సంక్రాంతి పండుగకు రాబట్టుకోవాలని కొందరు, ప్రతిష్ట కోసం మరికొందరు శ్రమిస్తున్నారు. పందేనికి పుంజును సిద్ధం చేసేందుకు సుమారు ఏడాది పాటు పెంచుతారు. ఇలా వీటి కోసం డ్రైఫ్రూట్స్. మటన్ కైమా కొనుగోలు చేస్తూ ఉండడంతో ఊహించని డిమాండ్ పెరిగింది.
పందెంకోళ్లకు మిలటరీ స్థాయిలో శిక్షణ..
ఈ పుంజులకు మిలటరీ స్థాయిలో శిక్షణ ఇస్తారంటే. పందేలపై ఏమేరకు శ్రద్ధ చూపుతారో అర్థం చేసుకోవచ్చు. ఉదయాన్నే 5గంటలకు కోడి పుంజులను బయటకు తీసి కాసేపు చల్లగాలి శ్వాస తీసుకునేలా చూట్టూ వలయంగా ఏర్పాటు చేస్తారు. అందులో కోడి పుంజులను వదిలిపెట్టి పరుగెత్తిస్తారు. ఆ తర్వాత వలయం నుంచి బయటకు తీసి స్విమ్మింగ్ చేయిస్తారు. పుంజులు బాగా అలసిపోయిన తర్వాత పాలల్లో నానబెట్టిన పిస్తా, ఖర్జూరా, కిస్మిస్లు పెట్టి సిరంజి ద్వారా పాలను పట్టిస్తారు. కోడి పుంజులు పందేలలో అన్ని విధాలుగా తట్టుకునే విధంగా శిక్షణ ఇస్తారు.