తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి శోభ సంతరించుకుంది. నగరాలన్నీ ఖాళీ అవుతున్నాయి. ప్రజలంతా పల్లెబాట పట్టారు. నాలుగైదు రోజులు కుటుంబంతో సరదాగా గడిపేందుకు సొంతూళ్లకు తరలివెళ్తున్నారు. ఐతే పండక్కి ఊరెళ్లే వారి కోసం ఎన్ని ప్రత్యేక రైళ్లు, బస్సులు దింపినా సరిపోవడంలేదు. కరోనా సమయంలోనూ జనం రద్దీ నెలకొంది.(ప్రతీకాత్మక చిత్రం)
నర్సాపూర్ - సికింద్రాబాద్ (07441) ప్రత్యేక రైలు.. 17న రాత్రి రాత్రి 8గంటలకు నర్సాపూర్‌లో బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 06.05గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. పాలకొల్లు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ ((07457) ప్రత్యేక రైలు.. కాకినాడ టౌన్ నుంచి 17న సాయంత్రం 6గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 05.20 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుటుంది. ఈ రైలు సామర్లకోట, ద్వారపూడి, రాజమహేంద్రవరం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, ఖాజీపేట స్టేషన్లలో ఆగుతుంది (ప్రతీకాత్మక చిత్రం)