P. Anand Mohan, Visakhapatnam, News18. Cock Fight Online Business: తెలుగు ప్రజల పెద్ద పండుగు సంక్రాంతి.. అందుకే విదేశాల్లో ఉన్నా.. ఇతర రాష్ట్రాల్లో ఉన్నా.. పండగ సమయానికి స్వగ్రామానికి చేరుకుంటూ ఉంటారు.. ఎందుకంటే మళ్లీ మళ్లీ ఆ సందడి రాదు.. సంక్రాంతి పండుగను అంత వైభంగా జరుపుకుంటారు తెలుగు ప్రజలు. సాధారణంగా సంక్రాంతి అంటే గంగిరెద్దులు, హరిదాసుల కోలాహలం, ముగ్గులు, గొబ్బెమ్మలు అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే.. కోడి పందేలు మరో ఎత్తుగా జరుగుతాయి. దీన్ని "గ్రామీణ క్రీడ అని ముద్దుగా పందెం రాయుళ్లు పిలుచుకుంటారు.
ఈ ఏడాది కూడా కోడి పందేలు భారీగా జరిగేందుకు సిద్ధం చేస్తున్నారు పందెం రాయుళ్లు.. ఇప్పటికే భారీగా రేటు పట్టి బరిలో దింపేందుకు కోడి పుంజలను కొనుక్కుని సిద్ధం అయ్యారు. కూడా మిలటరీ స్థాయిలో శిక్షణ ఇచ్చిన కోళ్లకు ఈ ఏడాది ఫుల్ డిమాండ్ పెరిగింది. పల్లెల్లో పెరిగిన పుంజులను భారీ ధర పెట్టి పట్టణాలకు తీసుకొస్తున్నారు. ఓ వైపు కోడిపందేలు నిర్వహించేందుకు పందె రాయుళ్లు సై అంటుంటే.. మరోవైపు పోలీసులు ఆంక్షలతో తాట తీస్తామంటున్నారు..
కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అయితే ఆంక్షలు జాన్తా నై అంటూ పందె రాయుళ్లు మీసం మెలేస్తున్నారు. ఇప్పటికే పందేలు నిర్వహించేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. పోలీసుల ఆంక్షలను లైట్ తీసుకుంటూ.. తగ్గేదేలే అని కాలుకు కత్తికట్టి బరిలోకి దిగేందుకు సై అంటున్నాయి కోడి పుంజులు..
ఇతర వస్తువులు అమ్మినట్టే.. కోడి పుంజులను కూడా ఆన్ లైన్ లో పెట్టి అమ్మేస్తున్నారు. ఫేస్ బుక్ లాంటి మాద్యమాల్లో వాటి ఫోటోలను, వీడియోలను పెడుతున్నారు. ఆ కోడి వయసు ఎంత..? ఎన్ని పందేల్లో నెగ్గింది.. ఎలా వాటిని పెంచారు. తదరిత వివారాలను అప్ లోడ్ చేస్తున్నారు. సోష ల్ మీడియాలో ప్రొఫైల్ చూసి.. తరువాత క్రాస్ చేసుకోని వాటిని కోనేందుకు పందెం రాయుళ్లు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇప్పుడా అవసరం లేదు.. జస్ట్ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. పందెం కోళ్లు ఎక్కడ అమ్ముతున్నారు.. ఎంతకు అమ్ముతున్నారు.. వేటికి డిమాండ్ ఉంది.. లాంటి వివారాలను ఆ బిజినెస్ చేసేవారు అప్ లోడ్ చేస్తున్నారు. అన్ని నచ్చితే రేట్ ఫిక్స్ చేసుకుని ఆర్డర్ చేస్తే.. కాలు కదపకుండానే పందెం కోడి మీ ఇంటికి వచ్చేస్తుంది..