Roja Selvamani: ఏ ఫర్ ఆపిల్, బీ ఫర్ బాల్.. విద్యార్థి అయిపోయిన రోజా.. ఫొటోలు వైరల్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, నగరి నియోజకవర్గం శాసనసభ్యురాలు ఆర్కే రోజా సెల్వమణి విద్యార్థి అయిపోయారు. తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. జనవరి 8న నగరి మండలం మిట్టపాళెం ఎంపీపీ పాఠశాలలో రూ. 11 లక్షలతో నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.