Road Accident: ఏపీలో తీవ్ర విషాదం.. 29 మంది కూలీలతో వాహనం వెళ్తుండగా కూలిన వంతెన.. ముగ్గురు గల్లంతు
Road Accident: ఏపీలో తీవ్ర విషాదం.. 29 మంది కూలీలతో వాహనం వెళ్తుండగా కూలిన వంతెన.. ముగ్గురు గల్లంతు
Road Accident: ఆంధ్రప్రదేశ్ ను రోడ్డు ప్రమాదాలు తీవ్రంగా భయపెడుతున్నాయి. ముఖ్యంగా ఆనంతపురం జిల్లాల్లో ఈ ప్రమాదాల సంఖ్య రెట్టింపు అవుతోంది. తాజాగా కూలీలతో ఓ వాహనం వెళ్తుండగా.. వంతెన కూలడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో వాహనంలో 29 మంది ఉన్నారు.
1/ 9
Road Accident: ఆంధ్రప్రేదశ్ ను వరుస ప్రమాదాలు భయపెడుతున్నాయి. ముఖ్యంగా రైతు కూలీలపై ప్రమాదాలు పంజా విసురుతున్నాయి. ఏ రూపంలో అవి వస్తున్నాయో తెలియడం లేదు. ఇటీవల రైతులు ప్రయాణిస్తున్న వాహనాల ప్రమాదాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు టెర్రర్ గా మారుతున్నాయి.
2/ 9
తాజాగా పండుగ రోజు పెను విషాదం నింపింది. ముక్కున పండుగ రోజు.. ఊహించని ప్రమాదం రైతుల పాలిట శాపంగా మారింది. అనంతపురం జిల్లాలో ఈ విషాదం ఘటన చోటు చేసుకుంది. పైన వాహనం నడుస్తుండగానే.. వంతెన కూలీ ముగ్గురు వ్యవసాయ కూలీలు గల్లంతయ్యారు.
3/ 9
అనంతపురం జిల్లాలోని డి.హీరేహాల్ మండలం నాగలాపురం, బొమ్మనహాల్ మండలం ఉద్దేహాళ్ గ్రామల మద్య హెచ్.ఎల్.సి. కాలవపై ఉన్న వంతెన కూలిపోయింది. అయితే వాహనంలో ఉన్న రైతులంతా ఏవో కబుర్లు చెప్పుకుని వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుని భారీగా శబ్ధం వచ్చింది.
4/ 9
అసలు ఏం జరిగిందో అని ఊహించేలోపే వంతెన విరిగి.. వాహనం ఒక్కసారిగా నీటిలో పడింది. దీంతో వాహనంలో ఉన్నవారంతా గట్టిగా ఆహాకారాలు చేశారు. సాయం చేయమని గట్టిగా కేకలు పెట్టారు.. ఈ ఈ ఘటనలో ముగ్గురు మహిళా కూలీలు గల్లంతయ్యారు.
5/ 9
ఉద్దేహాళ్కు చెందిన కూలీలు మల్లికేతి దగ్గర టమోటా పొలంలో పని చేయడానికి వెళ్లారు.. ఆ పని పూర్తవ్వడంతో సంతోషంగా డబ్బులు తీసుకుని తిరిగి ఎవరి ఇంటికి వారు చేరుకోవాలి అనుకున్నారు. చేతికి డబ్బులు రావడంతో వారంతా చాలా ఆనందంగా కనిపించారు. కానీ ఊహించిన ప్రమాదం వారిని తీవ్ర విషాదానికి గురి చేసింది.
6/ 9
ఆ గ్రమాంలో పనిచేసి తిరిగి స్వగ్రామానికి బొలెరో వాహనంలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న వాహనం కాలవపై రాగానే వంతెన సరిగ్గా మధ్యకు విరిగి కుప్ప కూలింది. డ్రైవర్ కూడా ప్రమాదాన్ని ఊహించలేకపోవడంతో వాహనం నీటిలో పడక తప్పలేదు. కానీ అంతా ఆ సమయంలో ప్రాణాలు అరచేత పెట్టుకున్నారు.
7/ 9
అప్పటికే భారీగా శబ్ధం రావడం.. నీటిలో పట్టవారంతా ప్రాణభయంతో అర్తనాదాలు చేయడంతో.. చుట్టు పక్కల వారికి వినిపించి హుటాహుగటిన అక్కడకు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు కూడా వెంటనే స్పందించింది.. నీటిలో పడ్డ కొందరిని బయటకు తీశారు.
8/ 9
వెంటనే స్థానికులు సాయం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మొత్తం 29 మంది రైతు కూలీలు వాహనంలో ఉండగా.. ముగ్గురు మహిళా కూలీలు నీటిలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని గల్లంతైన మహిళల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
9/ 9
వెంటనే స్థానికులు సాయం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మొత్తం 29 మంది రైతు కూలీలు వాహనంలో ఉండగా.. ముగ్గురు మహిళా కూలీలు నీటిలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని గల్లంతైన మహిళల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.