ఃP. Anand Mohan, Visakhapatnam, News18. Save Trees: పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. కాని ప్రస్తుతం నగరాలన్నీ కాంక్రీట్ జంగిల్ గా మారుతున్నాయి. అసలు చెట్టు అన్నది మచ్చుకైనా కనిపించకుండా చేసేస్తున్నారు. అపార్ట్ మెంట్లు.. బిల్డుగులు, ప్రైవేటు వెంచర్ల పేర్లతో చెట్లను ఇష్టాను సారం నరుక్కుంటూ పోతున్నారు...
వృక్షకోటిని, మూగ జీవీలను హతమార్చకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది అన్నారు ఆయన. అందుకే మానవతా దృక్పథంతో వృక్షసమారాధన నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యహవచనం, నవగ్రహామండపారాధన, వృక్షపూజ, మంత్రపుష్పం వంటి అంశాలతో పర్యావరణ పరిరక్షణ నిమిత్తం లోకకళ్యాణార్ధం మంత్రోచ్ఛారణతో వృక్షసమారాధన నిర్వహించారు.