ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సినీ అభిమానులు ఆర్ఆర్ఆర్ (RRR Movie) మేనియాతో ఊగిపోతున్నారు. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా సృష్టిస్తున్నారు. ఇటు రామ్ చరణ్ (Ram Charan), అటు ఎన్టీఆర్ (NTR) ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఆర్ధరాత్రి నుంచే ఫ్యాన్స్ షోలు మొదలైపోవడంతో సందడి మాములుగా లేదు. (Twitter/Photo)
ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ థియేటర్ల వద్దకు భారీగా చేరుకోవడంతో యాజమాన్యాలు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశాయి. కొన్నిచోట్ల ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడం పోలీసుల వల్లకావడం లేదు. ఇదిలా ఉంటే బ్లాక్ టికెట్ల అమ్మకంపై అభిమానులు మండిపడుతున్నారు. ఒక్కో టికెట్ కు రూ.500కు పైగా వసూలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.