ఆంధ్రప్రదేశ్ లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు ఏపీ-ఒడిశా తీరాలకు దగ్గర్లో వాయవ్య బంగాళాఖాతంలో ఈనెల 11 అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
ప్రస్తుతం ఉత్తర బీహార్ నుంచి ఝార్ఖండ్ మీదుగా.. ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. (ఫ్రతీకాత్మకచిత్రం)
3/ 5
ఉపరితల ద్రోణి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఏపీలోని కోస్తా తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 5
దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని.. రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 5
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల వల్ల అక్కడక్కడా పిడుగులు పడే అవకాశమున్నట్లు విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం)