AP Weather Update: ఏపీకి వర్షసూచన... రెండు రోజుల్లో అల్పపీడనం... ఈ జిల్లాలకు అలర్ట్..
AP Weather Update: ఏపీకి వర్షసూచన... రెండు రోజుల్లో అల్పపీడనం... ఈ జిల్లాలకు అలర్ట్..
AP Weather Report: అక్టోబర్ నెల (October) మొదలైనప్పటి నుంచి అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.
ఆంధ్రప్రదేశ్ ను ఆగస్టు నుంచి వర్షాలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టుతో పాటు సెప్టెంబర్లోనూ భారీగా వానలు పడ్డాయి. గత నెలలో వచ్చిన గులాబ్ తుపాను కారణంగా ఏపీలోని పలు జిల్లాలు తడిసిముద్దయ్యాయి. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 8
అక్టోబర్ నెల మొదలైనప్పటి నుంచి అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 10న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నాలుగైదు రోజుల్లో మరింత బలపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 8
ఉత్తర అండమాన్ సముద్రంలో ఈ నెల 10వ తేదీన ఒక అల్పపీడనం ఏర్పడి, తర్వాత 4-5 రోజుల్లో మరింత బలపడి దక్షిణ ఒడిసా-ఉత్తరకోస్తాంధ్ర తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 8
తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి ఒక ఉపరితల ద్రోణి దక్షిణ మధ్య కర్ణాటక, రాయలసీమ మీదుగా కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని, పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించింది. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 8
ఈ ప్రభావంతో గురువారం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న 2 రోజులూ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 8
ఐతే ఈ నెలలో ఆంధ్రప్రదేశ్ కు మరో రెండు తుపాన్ల ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్రంలో లానినా పరిస్థితుల వల్ల డైపోల్ వ్యతిరేకత పరిస్థితుల కారణంగా బంగాళాఖాతంలో తుపాన్లు ఏర్పడతాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
7/ 8
బంగాళాఖాతంలో అక్టోబర్ 14 లేదా 15వ తేదీల్లో ఒక తుపాను, 21 తర్వాత మరో తుపాను వస్తాయని వాతావరణ శాఖ తెలిపారు. రాబోయే రెండు తుపాన్ల కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు చెప్పారు. (ప్రతీకాత్మకచిత్రం)
8/ 8
ఇదిలా ఉంటే కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కొన్నిచోట్ల ఉక్కపోత కూడా నెలకొంటోంది. పలు ప్రాంతాల్లో 39 డిగ్రీల వరకూ పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు డిగ్రీలు పెరిగాయి. (ప్రతీకాత్మకచిత్రం)