AP Rain Forecast: ఏపీకి మూడు రోజుల పాటు వర్షసూచన.., ఈ జిల్లాలకు అలర్ట్..
AP Rain Forecast: ఏపీకి మూడు రోజుల పాటు వర్షసూచన.., ఈ జిల్లాలకు అలర్ట్..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎండలు (Summer) మండిపోతున్నాయి. బయటకు వెళ్లాలంటే జనం భయపడిపోతున్నారు. ఇదే సమయంలో వాతావరణ శాఖ చల్లనికబురు చెప్పింది. ఎండల నుంచి కాస్త ఉపశమనం కలగనుంది.
1/ 6
ఆంధ్రప్రదేశ్ లో ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్లాలంటే జనం భయపడిపోతున్నారు. ఇదే సమయంలో వాతావరణ శాఖ చల్లనికబురు చెప్పింది. ఎండల నుంచి కాస్త ఉపశమనం కలగనుంది. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 6
అండమాన్ సముద్రం, తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఉన్న తీవ్ర వాయుగుండం బలహీన పడింది. ఈరోజు ఆ వాయుగుండం అల్పపీడనంగా మారింది. మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ మరింతగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 6
దీంతో.. ఆంధ్రప్రదేశ్, యానంలోని దిగువ ట్రోపో ఆవరణములో తూర్పు గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లో రాగల మూడు రోజుల వరకు వాతావరణ చల్లబడే అవకాశముంది. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 6
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో మూడు రోజుల పాటు తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఈరోజు ఒకటి రెండు చోట్ల ఉరుములు లేదా మెరుపులతో కూడిన వర్షాలు కురిస్తాయని అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 6
దక్షిణ కోస్తా జిల్లాల్లో మూడు రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఈరోజు ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించవచ్చునని తెలిపింది. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 6
రాయలసీమలో ఈ రోజు రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. (ప్రతీకాత్మకచిత్రం)