అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. తెలంగాణలో రెండో రోజు కూడా అకాల వర్షాలు కురుస్తున్నాయి, రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. తెలంగాణలోని ఉత్తర, మధ్య ప్రాంతాలు, హైదరాబాద్ సహా అక్కడక్కడా ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఈ నెల 19 వరకు... ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తెలంగాణలోని అనేక జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. (image credit - twitter - keshaboinasri)
వేసవి నుంచి కాస్త ఉపశమనం : ఈ అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టం మిగిల్చాయి. వాసులకు మాత్రం ఎండల నుంచి కాస్క రిలీఫ్ లభించిందని చెప్పవచ్చు. వేసవి నుంచి వాసులు కొంత ఉపశమనం పొందారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు కురిశాయి. జహీరాబాద్ పట్టణంలో అరగంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. (image credit - twitter - @Mn1I96)
వడగళ్ల వానతో వికారాబాద్‌లోని మర్పల్లె గ్రామం కశ్మీర్‌ను తలపించింది. వాతావరణంలో మార్పు రావడంతో కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వల్ల పంట నష్టం వాటిల్లింది. తుపాను ధాటికి... చెరకు, జొన్న పంటలు, కూరగాయల పొలాలు ధ్వంసమయ్యాయి. సిద్దిపేట, మెదక్‌లలో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. (image credit - twitter - @Mn1I96)
తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనాలు: మార్చి 18 నుంచి 19 మధ్య భారీ ఉరుములు, వడగళ్ల వానలు వచ్చే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ వెల్లడించారు. హైదరాబాద్‌లో సాధారణ వర్షాలు కురుస్తాయన్నారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల్, నారాయణపేట, నల్గొండ, హైదరాబాద్, వికారాబాద్ సహా తెలంగాణలోని దక్షిణాది జిల్లాల్లో రోజంతా అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. యాదాద్రి భువనగిరి, మేడ్చల్, , జనగాం, వరంగల్, మెదక్ సహా మధ్య తెలంగాణలో వర్షాలు కురుస్తాయని అంచనాలున్నాయి. (image credit - twitter - @Mn1I96)
కొండ ప్రాంతాలలో వడగళ్ల వాన : కొండ ప్రాంతాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో వాతావరణం తీవ్రంగా ఉంటుంది. ఉరుములతో కూడిన బలమైన ఫోర్స్... నీటి బిందువులను లాగినప్పుడు వడగళ్ళు సంభవిస్తాయి. అక్కడ అవి మంచు గుళికలుగా గడ్డకడతాయి. వడగళ్ళు పడి.. పంటలు, భవనాలు, వాహనాలు దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఎత్తైన ప్రదేశాలలో చల్లని ఉష్ణోగ్రతలు వడగళ్ళు ఏర్పడటానికి దోహదపడతాయి. తత్ఫలితంగా, చదునైన ప్రాంతాలలో నివసించే వారి కంటే కొండ ప్రాంతాల్లో తరచుగా తీవ్రమైన వడగళ్ల వానలు కురుస్తాయి. (image credit - twitter - @meemelif)
ఏపీలోనూ వర్షాలు : ముందుగా అంచనా వేసినట్లుగానే ఆంధ్రప్రదేశ్‌లో ఉరుములతో కూడిన వర్షాలు నమోదవుతున్నాయి. పిడుగులు పడే ప్రమాదం ఉంది కాబట్టి.. ప్రజలు సురక్షితంగా ఉండాలనీ.. వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్లవద్దని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనీ... , అన్నమయ్య, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. (image credit - twitter - @sanjayweather_c)