Rain Alert in Telugu States: తెలుగు రాష్ట్రాలను వర్ష గండం ఇప్పుడే వదిలేలా కనిపించట్లేదు. మధ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దానికి అదనంగా తూర్పు బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం ఏర్పడింది. వాటి వల్ల ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో జోరు వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తా జిల్లాలు, ఉత్తరాంధ్రలో వర్షాలు దంచేస్తున్నాయి. రాయలసీమలో మోస్తరు వానలు పడుతున్నాయి. మరో మూడ్రోజులపాటూ కోస్తా, ఉత్తరాంధ్రలో అతిభారీ లేదా భారీ వర్షాలు ఉంటాయంటున్నారు. రాయలసీమలో మూడ్రోజులు మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ అధికారులు చెప్పారు. (credit - twitter)
తెలంగాణలో కూడా 10 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం కురిసిన వర్షం అదనపు కష్టాలు తెచ్చింది. వందల కాలనీలు నదుల్లా మారడంతో... ఏపీ, కర్ణాటక నుంచి స్పీడ్ బోట్లను తెప్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి తాను ఎప్పుడూ చూడలేదని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వం వరద బాధితులకు పరిహారం ప్రకటించింది. ఇవాళ్టి నుంచి ఆర్థిక సాయం పంపిణీ ఉంటుంది. తెలంగాణలో మరో మూడ్రోజులు సాధారణ, మోస్తరు వర్షాలు కురవనుండగా... గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం రెండ్రోజులు... అక్కడక్కడా భారీ లేదా అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు క్లారిటీగా చెప్పారు. దాంతో ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. (credit - twitter)
ప్రాణాలు తీస్తున్న క్యుములోనింబస్: హైదరాబాద్ ప్రజలకు మరో హెచ్చరిక కూడా చేశారు వాతావరణ అధికారులు. ఏంటంటే... హైదరాబాద్ లో వర్షాలు క్యుములోనింబస్ మేఘాల వల్ల కురుస్తున్నాయి. ఈ మేఘాలు దట్టమైనవి కావడం వల్ల వీటి వల్ల ఉరుములు, మెరుపులు, పిడుగుల సమస్య ఉంది. అందువల్ల ప్రజలు వర్షం పడేటప్పుడు... చెట్ల కిందకు వెళ్లొద్దంటున్నారు. అలాగే... పొడవుగా ఉండే ఊచలు, స్తంభాల దగ్గర ఉండొద్దంటున్నారు. వాటికి పిడుగుల్ని లాక్కునే శక్తి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. (credit - twitter)
జాలర్లు గానీ, పర్యాటకులు గానీ ఇప్పుడు ఏపీలో సముద్రం దగ్గరకు అస్సలు వెళ్లొద్దని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తీరం దగ్గర గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపారు. సముద్ర అలలు ఒక్కసారిగా ముందుకు వస్తున్నాయనీ... ఏం కాదులే అని సముద్ర అలల్లోకి వెళ్తే... ఒక్కసారిగా అలలు సముద్రం లోపలికి లాగేసుకునే ప్రమాదం ఉందని వాతావరణ అధికారులు మరీ మరీ చెబుతున్నారు. జాలర్లు చేపల వేటకు వెళ్లకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్లు ఏపీ తీర ప్రాంత జిల్లాల అధికారులు చెబుతున్నారు. (credit - twitter)