Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు..
Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు..
Rain Alert: గులాబ్ తుపాన్ ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలను వరదలు ముంచెత్తాయి. ఆ ముంపు నుంచి ఇంకా చాలా ప్రాంతాలు కోలుకోకముందే.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది.
ఈశాన్య, తూర్పు బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల వాయువ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ఈ అల్పపీడనం రాగల 24 గంటల్లో బలపడే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
ఇక దక్షిణ కోస్తా, రాయలసీమలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. తెలంగాణ జిల్లాల్లో అక్టోబరు 3 ఉదయం వరకు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
గులాబ్ తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర ప్రాంతంలోని పలు చోట్ల మంగళవారం కూడా వర్షాలు కురిశాయి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా సగటున 7.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుపాను... తీరం దాటిన తర్వాత క్రమంగా బలహీనపడింది. దిశను మార్చుకొని వాయుగుండంగా మారి మహారాష్ట్ర తీరం వైపు వెళ్తోంది. ఇవాళ అల్పపీడనంగా బలహీనపడే అవకాశముంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
ఐతే సెప్టెంబరు 30 నాటికి మహారాష్ట్ర, గుజరాత్ సమీపంలో అరేబియా సముద్రంలోకి ప్రవేశించి.. మళ్లీ బలపడే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండం, ఆ తర్వాత షాహీన్ తుపానుగా మారనుందని అంచనావేస్తున్నారు.