జిల్లాలో ఈ మధ్యకాలంలో ముత్యపు చిప్ప రకాలైన పుట్టగొడుల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. దీనిపై కృషి విజ్ఞాన కేంద్రం అనేక రకాల ప్రయోగాలు చేయడం జరిగిందని హోంసైన్స్ శాస్ర్తవేత్త భాగ్యలక్ష్మీ తెలిపారు. ముఖ్యంగా ఈ ముత్యపు చిప్ప పుట్టగొడుగులలో అధిక పోషకాలు ఉన్నాయి. ఇది సహజంగా దొరకడం కష్టం. అందుకోసమే కృత్రిమంగా రైతులు, ఇళ్లల్లో పెంచుకోవడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉంది.
ఇలా చేసిన తర్వాత 6-7 రోజులకు మొదటి పంట వస్తుంది. బెడ్లను రోజుకు 2 సార్లు తడిపి తేమ 65 శాతం ఉండేలా చూసుకోవాలి. తర్వాత 15 రోజుల వ్యవధిలో మూడు పంటలు మన చేతికి వస్తాయి. బెడ్లను ప్రతిరోజు పరిశీలిస్తూ నలుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగు ఉన్న బెడ్లను తీసి దూరంగా పారివేయాలి.. లేదంటే దీనిలో ఉన్న బ్యాక్టీరియా ఇతర బెడ్లకు వ్యాపించే అవకాశం ఉన్నది.
ప్రస్తుతం ప్రతీ శుభకార్యాలకు, ఇతరత్రా పార్టీలకు, వెజ్ తినేవాళ్ల కోసం ఈ పుట్టగొడుగుల కర్రీగా ఉపయోగిస్తున్నారు. దీంతో అధిక లాభాలు వస్తాయని కృషివిజ్ఙాన కేంద్రం చెబుతోంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో రిటైల్ కేజీ 200 రూపాయల నుంచి 300 రూపాయల వరకూ పలుకుతుంది. వీటికి ఎండు గడ్డి అవసరం ఖరీఫ్ సీజన్ గడ్డి అయితే మంచిదనేది శాస్త్రవేత్తల అభిప్రాయం.. ఇందులో కూడా బౌతిక పద్దతి, రసాయనక పద్దతిలలో దీనిని సాగుచేస్తారు... ముఖ్యంగా గడ్డిని మూడు నుండి 5 సెంటీమీటర్ల వరకూ కట్ చేసుకొని ఉంచుకోవాలి... వాటిని శుద్ది చేసిన తర్వాతనే విత్తనాలు విత్తుకోవాలని.. అధిక ఆదాయం పొందవచ్చన్నారు.