ఒంగోలులోని రూడ్ సెట్ ద్వారా స్థాపించిన సంవత్సరం నుండి ఇప్పటి వరకు 717 బ్యాచ్ లుగా, 20,600 మంది నిరుద్యోగులకు పలు రంగాలలో స్వయం ఉపాధి కొరకు ప్రత్యేక నైపుణ్యతా శిక్షణ ఇచ్చినట్లు డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. వీరిలో 286 మంది దివ్యాంగులు ఉండగా, పురుషులు 10788 మంది, స్త్రీలు 9812 మంది ఉన్నారు.
ఎవరైనా జీవితంలో స్వశక్తితో ఎదగాలని..కష్టపడి పైకి రావాలనుకునే వాళ్లకు ఈ రూడ్ సెట్ సెంటర్ ఆశ్రయం మాత్రమే కాదు..వసతి, ఉచిత భోజనంతో కూడిన శిక్షణ ఇచ్చేందుకు ఆహ్వానం పలుకుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక ఇక్కడ శిక్షణ పొంది జీవితంలో స్థిరపడిన వాళ్లు రూడ్ సెట్ సెంటర్ అందించిన సాయాన్ని మర్చిపోలేమంటున్నారు.