పది చదివి ప్రధానితోనే ప్రశంసలు అందుకున్నాడు.. ఇంతకీ అతను చేసిన అద్భుతం ఏంటో తెలుసా?
పది చదివి ప్రధానితోనే ప్రశంసలు అందుకున్నాడు.. ఇంతకీ అతను చేసిన అద్భుతం ఏంటో తెలుసా?
కొందరు బతకడం కోసం రకరకాల పనులు చేస్తుంటారు. అయితే మరికొందరు మాత్రం తమలో ఉన్న కళను మాత్రమే జీవించడం కోసం నమ్ముకుంటారు. ఆ కళతోనే.. తాము అనుకున్నది సాధిస్తుంటారు.. అలాంటి వ్యక్తుల్లో ప్రకాశం జిల్లాకు చెందిన ఈశ్వరాచారి ఒకరు.
చదివింది పదోతరగతి. అయినా కులవృత్తే దైవంగా భావించాడు. కులవృత్తిలోనే రాణించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా చెక్కపై తన స్వహస్తంతో కళాఖండాలు చెక్కుతూ, ప్రధాని నరేంద్ర మోడీచే ప్రశంసలందుకున్నాడు. అతనే ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలం ఈశ్వరాచారి.
2/ 10
జరుగుమల్లి మండలం కలికివాయి బిట్రగుంటకు చెందిన ఈయన 10వ తరగతి పూర్తయిన తర్వాత 17ఏళ్ల వయస్సులోనే తన తండ్రి వెంకట శేషయ్య, మావయ్య శేషయ్యల ప్రోత్సాహంతో కులవృత్తిలోకి అడుగులు వేశాడు. అప్పటి నుంచే చెక్కతో కళాఖండాల తయారీపై ప్రత్యేక దృష్టి ఉంచాడు. ప్రస్తుతం సింగరాయకొండలో నివాసముంటున్నారు.
3/ 10
ఈశ్వరాచారి ఇంటి నిండా ఎన్నో కళాఖండాలు ఉంటాయి. చెక్కతో కళాఖండాలు తయారు చేయడంలో దిట్ట అయిన ఈశ్వరాచారి, ప్రభుత్వ చిహ్నాలు చెక్కపై చెక్కే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.
4/ 10
కొత్తపట్నం వద్ద గతంలో జరిగిన ఎగ్జిబిషన్లో తన కళాఖండాలు ప్రదర్శించాడు. దీంతో నిమిషాల్లోనే ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు వాటిని కొనుగోలు చేశారట. అయితే ఇప్పటికీ కళా ఖండాలు తయారు చేస్తుండగా, ఇంటి నిండా అవే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
5/ 10
ఒక్కొక్క కళాఖండానికి రూ.60 వేలు ఖర్చు చేసి మరి ఆయన ఈ అద్భుతాలను సిద్దం చేస్తాడు. తాను తయారు చేసే ఒక్కొక్క కళాఖండానికి సుమారు రూ.60వేల ఖర్చు వస్తుందని ఈశ్వరాచారి తెలిపాడు.
6/ 10
అయితే ఒక్కొక్క కళాఖండ తయారీకి సుమారు 40 రోజుల సమయం పడుతుందని, దేశభక్తితో దేశ చిహ్నాలు స్వయంగా తయారు చేసినట్లు చెబుతున్నారు.
7/ 10
చెక్కతో కళాఖండాలు సృష్టిస్తున్న ఈశ్వరాచారిని ఇటీవల ప్రధాని మోడీ స్వయంగా అభినందించారు. జీ20 సమావేశాలకు సంబంధించి ప్రధాని మోడీ ముఖచిత్రంతో చెక్కపై అపురూప శిల్పాలను స్వహస్తంతో ఈశ్వరాచారి చెక్కారు. ప్రధాని మోడీకి తన కళాఖండం చేరాలని బీజేపీ ఆర్టిజెన్స్ రాష్ట్ర కన్వినర్ బంగారు బాబుతో తెలిపారు.
8/ 10
అనుకున్నదే తడవుగా హర్యానా ఎంపీ జాంగ్డాని ఫిబ్రవరి 4న కలిసి కళాఖండాన్ని అందజేశాడు. దీంతో ప్రధాని మోడీకి స్వయంగా ఎంపి అందజేశారు. అప్పుడే ఈశ్వరాచారిని ప్రధాని అభినందించినట్లు ఎంపీ తెలిపారు.
9/ 10
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు తనకు అందుతున్నాయని భావించిన ఈశ్వరాచారి, తన కళాఖండాలలో చిహ్నాలను చెక్కాడు.
10/ 10
సిఎం జగన్ కు స్కాచ్ అవార్డు, మహిళా సంక్షేమ పథకాలు, ఇలా పలు కళా ఖండాలు సిఎం జగన్కు స్వయంగా అందించాలన్నదే తన కోరిక గా ఈశ్వరాచారి తెలిపారు.