Summer Special Drink: మీరెప్పుడైనా కటోరా తాగారా?..ఈ హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే తాగకుండా ఉండలేరు!
Summer Special Drink: మీరెప్పుడైనా కటోరా తాగారా?..ఈ హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే తాగకుండా ఉండలేరు!
ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. 12 దాటితే ముఖం మాడిపోయే ఎండ ఉన్న పరిస్థితి నెలకొంది. అందుకే ఇటువంటి పరిస్థితి నుండి ఉపశమనం పొందేందుకు ప్రజలు కూల్ డ్రింక్, పలు పానీయాలు సేవించేందుకు అధిక ఆసక్తి కనబరుస్తారు. ఇలా ఒంగోలులోని ప్రజానీకం సమ్మర్ స్పెషల్ గా భావిస్తున్న 'కటోరా పానీయం' ప్రస్తుతం మార్కెట్ లో హల్ చల్ చేస్తోంది. అసలు దీన్ని ఎలా తయారు చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. 12 దాటితే ముఖం మాడిపోయే ఎండ ఉన్న పరిస్థితి నెలకొంది. ఇక ఎండకు తోడు తీవ్ర ఉక్కపోత కూడా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
2/ 8
అందుకే ఇటువంటి పరిస్థితి నుండి ఉపశమనం పొందేందుకు ప్రజలు కూల్ డ్రింక్, పలు పానీయాలు సేవించేందుకు అధిక ఆసక్తి కనబరుస్తారు.
3/ 8
ఇలా ఒంగోలులోని ప్రజానీకం సమ్మర్ స్పెషల్ గా భావిస్తున్న 'కటోరా పానీయం' ప్రస్తుతం మార్కెట్ లో హల్ చల్ చేస్తోంది. అసలు దీన్ని ఎలా తయారు చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
4/ 8
కటోరా అనే పదార్థం బాదం చెట్టు జిగురుతో తయారవుతుందంట. అయితే ఈ జిగురును రాత్రి వేళ నీటిలో ఉంచి, మరుసటి రోజు చూసిన యెడల జిగురు వెళ్లి ఓ మెత్తని పదార్థంలా తయారవుతుంది. దీనినే కటోరా అంటారు.
5/ 8
ఈ కటోరా రుచి మాత్రం చప్పగా ఉండడంతో..రుచికై తేనె, పాలు వంటి పదార్థాలను కలిపి కూల్ డ్రింక్స్ దుకాణ యజమానులు విక్రయిస్తుంటారు.
6/ 8
కటోరా పాలు త్రాగడం ద్వారా పలు ఉపయోగాలు ఉన్నట్లు ప్రజలు భావిస్తారు. శరీర వేడిని తగ్గించడం, వీర్య కణాల పెంపు, వంటి ప్రయోజనాలు ఉండడంతో కటోరా పాలకు ఒంగోలులో గిరాకీ అధికం.
7/ 8
ఎండాకాలంలో అధికంగా కూల్ డ్రింక్స్ సేవించడం కన్నా, కటోరాను సేవించడం ఆరోగ్యానికి మంచిదిగా పలువురు News18తో తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
8/ 8
ఓ వ్యక్తి అయితే ప్రతి సమ్మర్ లో ఖచ్చితంగా ప్రతి రోజు కటోరా త్రాగుతానని, సుమారు 20 ఏళ్లుగా సేవిస్తున్నట్లు తెలిపారు. ఇలా పలువురు యువకులు సైతం కటోరా పై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.