సాక్షాత్తు శ్రీరాముడు నడయాడిన పుణ్యధామం. శ్రీరామ బాణంతో ఉద్భవించిన కోనేరు. ఎక్కడో కాదు ఏపీలోనే. ఇంతకీ ఏపీలో ఎక్కడ? దాని ప్రాముఖ్యత ఏంటి? దాని విశేషాలు ఏంటో తెలుసుకుందాం..
2/ 8
సాక్షాత్తు శ్రీరాముడు అరణ్యవాసం చేస్తూ..ఈ ఆలయాన్ని దర్శించారు. అంతే కాదు తన రామ బాణంతో పాతాళగంగను పైకి తెచ్చారు.
3/ 8
ఆ కోనేరు నేటికి భక్తుల పాలిట పాపాల హరిణిగా పేరు గాంచింది. ఇంతటి చారిత్రాత్మక ఆలయం ప్రకాశం జిల్లాలోని బేస్తవారిపేట మండలం మోక్షగుండం పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉంది.
4/ 8
అంతేకాదు మోక్షగుండం పరిధిలోని అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీ ముక్తేశ్వర ఆలయానికి పురాణ గాథలు ఎన్నో, ఎన్నెన్నో.
5/ 8
పరశురాముడు తన తల్లి రేణుకాదేవిని హత మార్చి, పాప పరిహారానికై ఈ ఆలయాన్ని దర్శించి ముక్తిని పొందారు. అందుకే ఈ ఆలయం శ్రీ ముక్తేశ్వరాలయంగా పేరు గాంచింది. ఈ ఆలయం చుట్టూ ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది.
6/ 8
శ్రీరాముడు అరణ్యవాసంకై సీతా సమేత ఇక్కడకు వచ్చినట్లు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. శ్రీరాముడు ఈ ఆలయం వద్దకు వచ్చిన సమయంలో..తన తండ్రి దశరథుని సంవత్సరీకం చేయాల్సి వచ్చింది.
7/ 8
అయితే ఆ సమయంలో సమీపాన నీరు లేకపోవడంతో..శ్రీరాముడు తన బాణంతో పాతాళ గంగను ఉద్భవింపజేశారు. ఇప్పటికీ ఈ కోనేరు శ్రీరాముని కోనేరుగా పేరు గాంచింది.
8/ 8
ఆలయాన్ని దర్శించిన భక్తులు ఈ కోనేరులోని నీటిని పవిత్ర జలాలుగా భావించి నీటిని త్రాగడమే కాక, నీటిని చల్లుకుంటారు. అంతటి చారిత్రాత్మక చరిత్ర గల ఆలయంలో శ్రీ ముక్తేశ్వర స్వామి నేటికీ పూజలందుకుంటున్నారు.