తిరుమలలో ఫిబ్రవరి 5న పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
స్కంద పురాణాను సారం పూర్వకాలమున శ్రీరామకృష్ణుడు అనే మహర్షి వేంకటాద్రిపై తపస్సు చేసి, తాను స్నానమాచరించడానికి ఈ తీర్థాన్ని రూపొందించుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ తీర్థ తీరమున నివసిస్తూ.. స్నానపానాదులు చేస్తూ.. శ్రీమహావిష్ణువును గూర్చి కఠోర తపస్సు ఆచరించి విష్ణువు సాక్షాత్కారంతో ముక్తి పొందానని భక్తులు నమ్ముతారు.(ప్రతీకాత్మక చిత్రం)
ఈ పర్వదినం నాడు ఉదయం 7 గంటలకు శ్రీవారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలతో పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు.. పూజా సామగ్రిని తీసుకు వెళ్ళి శ్రీరామకృష్ణ తీర్థంలో ఉన్న శ్రీరామచంద్ర మూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఉత్సవంలో ఆలయ అర్చకులు, టిటిడి అధికారులు, భక్తులు పాల్గొంటారు.(ప్రతీకాత్మక చిత్రం)