బస్సులు, కార్లు, బైకులపై వెళ్లేవారిని కూడా తనిఖీ చేసిన తర్వాతే పంపుతున్నారు. అలాగే బస్సుల రాకపోకలను కూడా కొన్నిచోట్ల నిలిపేశారు. మచిలీపట్నం-విజయవాడ హైవేపై రాకపోకలు కూడా తగ్గించారు. ఈ మార్గంలో బస్ సర్వీసులుకూడా నిలిపేశారు. మచిలీపట్నంలో కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్.. స్వయంగా చెక్ పోస్ట్ దగ్గర విధులు నిర్వహించారు.