ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అక్రమ మద్యంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. స్పెషల్ ఎన్ ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో నిత్యం దాడులు నిర్వహిస్తూ కల్తీ మద్యం, అక్రమ మద్యాన్ని పోలీసులు భారీగా సీజ్ చేస్తున్నారు. ప్రతి జిల్లాలో వేలాది మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఆ మద్యాన్ని ధ్వంసం చేసి అక్రమార్కులకు వార్నింగ్ ఇస్తున్నారు.
ఎవరైనా అక్రమ మద్యం రవాణా మరియు విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఎస్పీ మల్లిక గర్గ్ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లు మరియు SEB స్టేషన్ల పరిధుల్లో సీజ్ చేసిన వేలకొద్దీ అక్రమ మద్యం బాటిల్స్ ను ఈ రోజు ఒంగోలు దగ్గర్లోని అగ్రహారం గ్రామం సమీపంలో ఉన్న నేషనల్ హైవే బ్రిడ్జి క్రింద రోడ్డు రోలర్ ద్వారా ఎస్పీ స్వయంగా ధ్వంసం చేశారు.
ఈ కార్యక్రమంలో SEB జాయింట్ డైరెక్టర్ అడిషనల్ ఎస్పీ యన్.సూర్యచంద్ర రావు గారు, SEB సూపరింటెండెంట్ A.అవులయ్య, DSB DSP బి.మరియాదాసు, ఒంగోలు డిఎస్పీ యు.నాగరాజు, ఒంగోలు ట్రాఫిక్ డిఎస్పీ మల్లికార్జున రావు, AES యం. సుధీర్ బాబు, మార్కాపురం ES ఏ. శ్రీనివాస నాయుడు, ఒంగోలు తాలూకా సిఐ శ్రీనివాస రెడ్డి, SEB CI వంశీధర్ గారు SEB సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.