P Anand Mohan, Visakhapatnam, News18.. Polavaram Project: పోలవరం ప్రాజెక్టు పనులు మరింత ఆలస్యం కానున్నాయా..? ప్రధాన డ్యామ్ అయిన ఎర్త్‌కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ పనులు ఇంకా ఎందుకు పూర్తి కాలేదు..? గత తెలుగుదేశం ప్రభుత్వం ఎర్త్‌కమ్ రాక్‌ఫిల్ నిర్మాణానికి అనుకూలంగా నదిలోపల డయాఫ్రం వాల్ నిర్మించింది. ఆ తరువాత ఎందుకు దానిని పంటించుకోలేదు..?
ప్రస్తుత పరిస్థితిని బట్టి ఈ వేసవిలో కూడా ఎర్త్‌కమ్ రాక్‌ఫిల్ డామ్ పనులు వేగంగా మొదలుకాకపోవచ్చు. దీనికి డిజైన్ రావలసి ఉంది. గతంలో నిర్మించిన డయాఫ్రం వాల్ ఎంతవరకూ పటిష్టంగా ఉంది, ఏమైనా దెబ్బతిందా, వరదల వల్ల కేవలం పైభాగమే దెబ్బతిందా, లేక ప్రస్తుతం డయాఫ్రంవాల్ ఆధారంగానే ఎర్త్‌కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మించవచ్చా అనే అంశాలు తేలాలి.