Polavaram Project: పరుగులు పెడుతున్న పోలవరం... ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టం..
Polavaram Project: పరుగులు పెడుతున్న పోలవరం... ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టం..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు (Polavaram project) నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ప్రాజెక్టు స్పిల్ వేలో మరో ప్రధాన అంకం పూర్తైంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ప్రాజెక్టు స్పిల్ వేలో మరో ప్రధాన అంకం పూర్తైంది. స్పిల్ వే బ్రిడ్జిపై గడ్డర్ల అమరికను అధికారులు పూర్తి చేశారు.
2/ 9
ప్రపంచంలోనే భారీ స్పిల్ వే నిర్మాణంలో అదే స్థాయిలో భారీ గడ్డర్లను వినియోగించారు. అతి తక్కువ కాలంలో అంటే కేవలం 60 రోజుల్లోనే 192 భారీ గడ్డర్లను మేఘా ఇంజనీరింగ్ సంస్థ అమర్చింది.
3/ 9
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారుల నిరంతర పర్యవేక్షణలో గడ్డర్ల అమరిక పనులు పూర్తచేసినట్లు మేఘా ఇంజనీరింగ్ సంస్థ తెలిపింది.
4/ 9
స్పిల్ వే బ్రిడ్జి నిర్మాణానికి మొత్తం 192 గడ్డర్లను వినియోగించారు. వీటిపై షట్టరింగ్ పనులు చేసి స్లాబ్ నిర్మిస్తారు.
5/ 9
ఒక్కోగడ్డర్ 23 మీటర్లు పొడవు, 2 మీటర్లు ఎత్తులో నిర్మించారు. అలాగే ఒక్కో గడ్డర్ తయారీకి 10 టన్నుల స్టీల్, 25 క్యూబిట్ మీటర్ల కాంక్రీట్ వినియోగించారు. ఒక్కో గడ్డర్ బరువు 62 టన్నులు ఉంటుంది.
6/ 9
మొత్తం గడ్డర్ల తయారీకి 1920 టన్నుల స్టీల్, 4800 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగించారు.
7/ 9
గత ఏడాది ఫిబ్రవరి 17న మేఘా ఇంజనీరింగ్ సంస్థ గడ్డర్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. ఏడాది కాలంలోనే నిర్మాణం పూర్తి చేసి అమర్చింది.
8/ 9
గత ఏడాది జూలై 6న పిల్లర్లపై అమర్చడం ప్రారంభించింది. సగడ్డర్లను పిల్లర్లపై అమర్చడానికి 200 టన్నుల రెండు భారీ క్రేన్లు వినియోగించారు.
9/ 9
2022 నాటికి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.