POLAVARAM PROJECT WORKS GETTING SPEED AS CONSTRUCTION OF 52 SPILL WAY PILLARS WERE COMPLETED BY MEGHA ENGINEERING COMPANY HERE ARE THE DETAILS PRN
Polavaram Project: పరుగులు పెడుతున్న పోలవరం పనులు.. మరో కీలక ముందడుగు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు (Polaaram Project) నిర్మాణం వేగంగా సాగుతోంది. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన స్పిల్ వే పిల్లర్ల నిర్మాణం పూర్తైంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన స్పిల్ వే పిల్లర్ల నిర్మాణం పూర్తైంది.
2/ 7
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశంతో అనుకున్న లక్ష్యానికే పనులు పూర్తి చేసేలా జనవనరుల శాఖ ముందుకు వెళ్తోంది.
3/ 7
స్పిల్ వే బ్రిడ్జిలోని 52 పిల్లర్లు.. 52 మీటర్లు నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నట్లు ప్రాజెక్టు అధికారులు ప్రకటించారు. ఐతే స్పిల్ వే 2వ బ్లాక్ ఫిష్ లాడర్ నిర్మాణ చేపట్టడం వల్ల డిజైన్లకు సంబంధించి అనుమతుల ఆలస్యం కావడం వల్ల 2వ పిల్లర్ నిర్మాణం ఆలస్యమైంది.
4/ 7
పోలవరం పనులను జలవనరుల శాఖ అధికారులతో పాటు మేఘా ఇంజనీరింగ్ సంస్థ వేగంగా పనులు జరుపుతోంది.
5/ 7
పోలవరం స్పిల్ వే పొడవు 1,128 మీటర్లు కాగా.. 2019 నవంబర్ 21 నుంచి ఇప్పటివరకు 1, 095 మీటర్ల బ్రిడ్జి స్లాబ్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇక కేవలం 33 మీటర్లు మాత్రమే పూర్తి చేయాల్సి ఉంది.
6/ 7
స్పిల్ వే పిల్లర్లపై 192 గడ్డర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటికే 188 గడ్డర్లను పిల్లర్లపై ఏర్పాటు చేశారు. మరో 4 గడ్డర్లు మాత్రమే పిల్లర్లపై ఏర్పాటు చేయాల్సి ఉంది.
7/ 7
స్పిల్ వే బ్రిడ్జిపై 48 కాంక్రీట్ స్లాబులు వేయాల్సి ఉండగా.. ఇప్పటివకు 45 పూర్తయ్యాయి. అలాగే 49 ట్రూనియం భీమ్ లు పూర్తయ్యాయి. స్పిల్ వే బ్రిడ్జిలో 48 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు 28 గేట్ల అమరిక పూర్తైంది.