Petrol Price Hike: మరోసారి పెరిగిన పెట్రోల్ ధర.. తెలుగు రాష్ట్రాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..

దేశంలో రెండు రోజులు స్థిరంగా ఉన్న పెట్రోల్ ధరలు.. శుక్రవారం మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధరను చమురు కంపెనీలు 35 పైసలు పెంచాయి. అయితే డీజిల్ ధరలను మాత్రం పెంచలేదు. ఇప్పటికే పలుచోట్ల లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటి.. రికార్డు స్థాయికి చేరిన తెలిసిందే.