రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (NTR) హీరోలుగా వస్తున్న భారీ బడ్జెట్ సినిమా RRR (RRR Movie). ఈనెల 7న విడుదల కావాల్సిన సినిమా కరోనా (Corona) కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు మరో షాక్ తగిలింది.
1/ 7
రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా వస్తున్న భారీ బడ్జెట్ సినిమా RRR. ఈనెల 7న విడుదల కావాల్సిన సినిమా కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో సినిమా యూనిట్ తో పాటు అభిమానులకు షాక్ తప్పలేదు. విడుదల వాయిదా పడిన సినిమాను మరిన్ని కష్టాలు వెంటాడుతున్నాయి. (File/Photo)
2/ 7
తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సినిమాలో అల్లూరి సీతారామరాజు జీవితాన్ని వక్రీకరిస్తున్నారంటూ అల్లూరి యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు వీరభద్రరరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. సినిమాలో అల్లూరి జీవితంపై అభూత కల్పనలు చూపిస్తున్నారని మండిపడ్డారు. (ఫైల్)
3/ 7
బ్రిటీషువారికి వ్యతిరేకంగా పోరాడిన అల్లూరి సీతారామరాజును బ్రిటిష్ పోలీస్ పాత్రలో చూపించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఇలాంటి సన్నివేశాలతో భావితరాలకు తప్పుడు సమాచారమిస్తున్నారని.. వెంటనే అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు.
4/ 7
అలాగే అల్లూరి సీతాతారమరాజు, కొమురం భీమ్ కలిసినట్లు చరిత్రలో ఎక్కడా లేదని.. తప్పుడు సమాచారంతో ఇద్దర్నీ కలిపి సినిమా తీస్తూ.. చరిత్రను వక్రీకరిస్తున్నారన్నారని పిటిషనర్ ఆరోపించారు. ఈ మేరకు చరిత్రను వక్రీకరించే సన్నివేశాలను తొలగించాలని నిర్మాతకు ఆదేశాలివ్వాలని కోరారు.
5/ 7
ఐతే దీనిపై ఇంతవరకు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం స్పందించలేదు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు, కొమురం భీం వంటి ఇద్దరు యోధులు కలిస్తే ఎలా ఉంటుందనే కల్పిత కథతో మాత్రమే సినిమా తీస్తున్నట్లు గతంలో ఎస్ఎస్ రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే.
6/ 7
ఇదిలాఉంటే ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాకు వ్యతిరేకంగా అల్లూరి సౌమ్య తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అల్లూరి, కొమురం భీమ్ జీవితానికి విరుద్ధంగా సినిమా నిర్మించడం సరికాదని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు.
7/ 7
కాగా రూ.450 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తుండగా.. అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.