Nara lokesh Yuvagalam Padayatra: టీడీపీ నేత నారా లోకేశ్‌కి చిత్తూరు పోలీసులు షాకిచ్చారు. పలమనేరులో ఆయన ప్రసంగం అనంతరం.. ప్రచార రథాన్ని సీజ్ చేశారు. అనుమతి లేదంటూ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కి చిత్తూరు పోలీసులు షాకిచ్చారు. పలమనేరులో ఆయన ప్రచార రథాన్ని సీజ్ చేశారు. పోలీసుల తీరుపై లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం.. టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేయడంతో.. అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
2/ 7
‘యువగళం’ పాదయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా పలమనేరులో నారా లోకేశ్ పర్యటిస్తున్నారు. యాత్రలో భాగంగా.. పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద తన ప్రచార రథం పైకి ఎక్కి ఆయన మాట్లాడారు. లోకేశ్ మైకులో మాట్లాడంపై పోలీసులు అభ్యంతరం చెప్పారు.
3/ 7
లోకేశ్ ప్రసంగం అనంతరం.. ఆయన దిగిన తర్వాత.. ప్రచార రథాన్ని పలమనేరు పోలీసులు సీజ్ చేశారు. పాదయాత్రలో మైక్‌కు అనుమతి లేదని.. అందుకే సీజ్ చేశామని పలమనేరు డీఎస్పీ స్పష్టం చేశారు. అనంతరం ఆ వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
4/ 7
పోలీసుల తీరుపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. నారా లోకేశ్ రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. ఏం చట్టం ప్రకారం వాహనాన్ని సీజ్ చేశారని నిలదీశారు. పలమనేరు డీఎస్పీతో నారా లోకేష్, అమర్నాథ్ రెడ్డి వాగ్వాదానికి దిగారు.
5/ 7
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం. 1 రాజ్యాంగానికి వ్యతిరేకమని.. దీనిపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. వాహనాన్ని ఇచ్చే వారకు వెళ్లేదని లేదని తెగేసి చెప్పారు. నారా లోకేశ్ రోడ్డుపై బైఠాయించడంతో.. పోలీసులు ప్రచార రథాన్ని విడిచిపెట్టారు. అనంతరం నారా లోకేశ్ తిరిగి తన పాదయాత్రను కొనసాగించారు.
6/ 7
పాదయాత్ర సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ దళిత ద్రోహి అని.. ఎస్సీ, ఎస్టీలపైనే ఎట్రాసిటీ కేసులు పెడుతూ వేధిస్తున్నారని మండిపడ్డారు. దళితులను చంపేసి మృతదేహాలను ఇంటికి పంపుతున్నారని విరుచుకుపడ్డారు.
7/ 7
కాగా, నారా లోకేశ్ తలపెట్టిన యువగళం పాదయాత్ర జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో లక్ష్మీపురం వద్ద శ్రీవరదరాజస్వామి ఆలయం వద్ద ప్రారంభమైంది. ఏడాదికి పైగా సాగే యాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర సాగనుంది.