ఆస్పత్రులు, ల్యాబ్ లు, మెడికల్ షాపులు, ప్రింట్, ఎలక్ట్రానికి మీడియా, టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్, బ్రాడ్ కాస్టింగ్, ఐటీ సర్వీసులు, పెట్రోల్ బంకులు, విద్యుత్ సంస్థలు, త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంబంధిత ఐడీ కార్డును చూపించి అత్యవసరమైతే వెళ్లవచ్చని పేర్కొంది. (ప్రతీకాత్మకచిత్రం)
ఇక ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చేవారికి ప్రత్యేక రూల్స్ విధించింది. ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లకు వెళ్లేవారు.. అక్కడి నుంచి వచ్చేవారు తమ ప్రయాణానికి సంబంధించి టికెట్ చూపించాల్సి ఉంటుంది. ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్ల నుంచి ఇళ్లకు వెళ్లాల్సిన వారికి స్థానిక అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించింది.
దుకాణాలు, షాపింగ్ మాల్స్ లో మాస్క్ లేకుండా వినియోగదారులను అనుమతిస్తే సంబంధిత యాజమాన్యానికి రూ.10వేల నుంచి రూ.25వేల వరకు జరిమానా విధిస్తామని పేర్కొంది. కొవిడ్ నిబంధనలు ఉల్లఘించిన వ్యాపార సంస్థలను రెండు రోజుల పాటు మూసివేస్తామని స్పష్టం చేసింది. ఇక ఆలయాలు, ప్రార్ధనా మందిరాల్లో మాస్క్, భౌతిక దూరం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. (ప్రతీకాత్మకచిత్రం)