YSR Pension Kanuka: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) సంక్షేమ కార్యక్రమాలనే (Welfare Schemes)క్రమం తప్పకుండా అమలు చేస్తోంది. అయితే ఆ పథకాలను సక్రమంగా లబ్ధిదారులకు అందేలా చేయడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త నిబంధనలు (New rules)అమలు చేస్తోంది. వీటిలో కొన్ని వివాదాస్పదమవుతున్నాయి.
అధికారంలోకి రాక ముందు జగన్.. పలు హామీలు కురిపించారు. పాదయాత్ర సందర్భంగా తమ సమస్యలు చెప్పుకున్నవారికి భరోసా కల్పిస్తూ పలు హామీలు ఇచ్చారు. ఆ మాటను నిలుపుకునే దిశగా పాత సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూనే.. కొత్త వాటిని ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ వస్తున్నారు. మరికొన్నిటికి పేరు మార్చి.. లబ్ధి దారుల జాబితాను పెంచుతున్నారు. అలాగే అధికారంలోకి రాక ముందు జగన్ ఇచ్చిన హామీల్లో వైయస్సార్ ఫించన్ పథకం (YSR Pension kanuka) ఒకటి
అధికారంలోకి వచ్చిన తర్వాత…వృద్ధాద్యపు, వితంతు ఫించన్లను రూ. 2 వేల 250కి పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఈ ఫించన్ విషయంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ఈ పథకాన్ని లోపభూయిస్టంగా నిర్వహించడానికి కొత్త రూల్స్ ప్రవేశ పెట్టింది. అదే ఇప్పుడు పెన్షన్ లబ్ధి దారులను కలవర పాటుకు గురి చేస్తోంది.
ఈ నిబంధన పెట్టడానికి అసలు కారణం ఏంటంటే.. ఏపీలో ఉండకుండా..పొరుగు రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న వారు..ఫించన్ పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. వీరు మూడు నెలలకొకసారి…వస్తూ..ఒకసారి డబ్బు తీసుకెళుతున్నట్లు తేలింది. అర్హత లేకపోయినా..అక్రమ ఫించన్ పొందుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ తరహా అక్రమాలను అరికట్టేందుకు కొత్త నిబంధన తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం. చూడాలి మరి ఇది ఎంత వరకు సక్రమంగా అమలవుతుందో..?