P Anand Mohan, Visakhapatnam, News18. Beach Rooftop Dining: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన విశాఖ నిత్యం కొత్తగా కనిపిస్తునే ఉంటుంది. కొందరి సరికొత్త ఆలోచనలు కొత్త కొత్త అనుభూతులను పెంచుతాయి. తాజాగా ఆహా అనిపించే అనుభూతి విశాఖ వాసులను ఆహ్వానిస్తోంది. బీచ్ లో ఏర్పాటు చేసిన బీచ్ రూప్ డైనింగ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి తెలుసా..?
సాధారణంగానే కొత్త ఆలోచనలతో ఎవరు ముందుకు వచ్చినా..? నగర వాసులు ఆదరిస్తూనే ఉంటారు. అదే నమ్మకంతో ఓసియన్ ఎడ్జ్ పేరుతో మొబైల్ రూఫ్‌టాప్ డైనింగ్ రెస్టారెంట్‌ను తీర్చిదిద్దాడు. దీని ప్రత్యేకత ఏంటంటే.. బీచ్ అందాలను ఆహ్వదిస్తూ.. బస్సు టాప్‌పై కూర్చుని సముద్ర అందాలను వీక్షిస్తూ ఇష్టమైన ఆహారాన్ని తీనే ఫీల్ కలిగేలా చేశాడు.
ఈ సరికొత్త రూఫ్ టాప్‌పై కూర్చుని సముద్రం అలల చూస్తూ తింటుంటే ఏదో తెలియని సరికొత్త అనుభూతి పొందుతున్నాం అంటున్నారు నగర వాసులు.. అందులోనూ అక్కడ దొరికే కాంబినేషన్ ఫుడ్ కూడా కాస్త వెరైటీగానే ఉంది అంటున్నారు.. పాత కాలం గోలిసోడ టేస్ట్ ను ఎంజాయ్ చేస్తూ.. షీ ఫుడ్ తింటుంటూ ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంది అంటున్నారు. ఆహారా ప్రియులు.
బస్సుపైన డైనింగ్ చేస్తూ నగర వాసులు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి రెస్టారెంట్లు నగరంలో ఏర్పాటు చేయాలని చందు భావిస్తున్నాడు. మొబైల్ రూఫ్‌టాప్ రెస్టారెంట్లో అన్ని రకాల ఆహారం పదార్థాలు లభిస్తున్నాయి. పాతతరం గోలి సోడ నుంచి కొత్త తరం పిజ్జా, బిర్యానీ, బర్గర్లు వరకు అనేక వంటకాలు అందుబాటులో ఉన్నాయి.
పర్యాటక ప్రాంతమైన విశాఖలో తన ముద్ర చూపించాలని చందూ తాపత్రయ పడుతుంటాడు. అందుకే ఇలా వినూత్నమైన ఆలోచనలతో ముందుకు సాగేవాడు. అలాంటి సమయంలో ఫ్యామిలీతో యూరప్ వెళ్లినప్పుడు ఎక్కువగా ఇంటువంటి మొబైల్ రూఫ్‌టాప్ డైనింగ్ రెస్టారెంట్లను చూశాడు. అబ్బా భలే ఉందే...మన విశాఖలో ఇలా పెడితే బ్రహ్మాండంగా ఉంటుందని నిర్ణయించుకుని విశాఖ ప్రజలకు అందించాడు.