కొత్త వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా హాట్ హాట్‌గా జరుగుతోంది. ఈ చట్టాలపై రాజకీయ దుమారం కూడా కొనసాగుతోంది. ఢిల్లీ శివారులో వేలాది మంది రైతులు 25 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఐతే ఈ ఆందోళనల వెనక రాజకీయ కారణాలు ఉన్నాయని.. విపక్షాల ఉచ్చులో పడవొద్దని రైతులకు ప్రభుత్వం సూచిస్తోంది. అంతేకాదు రైతుల ఆందోళలు సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్లాయని స్పష్టం చేసింది. ఈ క్రమంలో అసలు కొత్త చట్టాలపై క్షేత్రస్థాయిలో రైతులు ఏమనుకుంటున్నారు? కొత్త చట్టాలను సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? అని న్యూస్ 18 తెలుసుకునే ప్రయత్నం చేసింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 2412 మంది ఓపీనియన్ సర్వేలో పాల్గొన్నారు. రైతులు, సాధారణ ప్రజలతో న్యూస్ 18 రిపోర్టర్లు మాట్లాడారు. వారికి 12 ప్రశ్నలు సంధించి సమాధానాలు తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఏమన్నారో ఇక్కడ చూడండి.