జీవితం అన్నాక విభిన్నంగా ఏదైనా చేస్తేనే గుర్తింపు. అందుకే చాలా మంది తమ అభిరుచులకు తగ్గట్లు ఏదైనా వెరైటీగా చేస్తూ పేరు తెచ్చుకుంటూ ఉంటారు. అలాంటి పనే ఓ యువకుడు చేస్తున్నాడు. వ్యవసాయం చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. వ్యవసాయంలో వెరైటీ ఏముంటుంది అని అనుకుంటున్నారా..? అతడు చేసేది రాయల్ వ్యవసాయం. ఏకంగా శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి పంటలు పడిస్తున్నాడు.
తమకున్న ఆరు ఎకరాల్లో శ్రీ కృష్ణ దేవరాయల కాలంనాటి దేశవాళీ రకమైన బహురూపి అనే వారి వంగడాన్ని సాగుచేసేందుకు ఎంచుకున్నాడు. హైదరాబాద్ లోని సేవ్ అనే సంస్థ నుంచి ఈ వంగడాన్ని సేకరించాడు. బహురూపి రకం బియ్యం చాల రుచిగా ఉంటాయని ఈ బియ్యం గురించి రాయల వారు తాను రచించిన ఆముక్త్యమాల్యద లో కూడా ఈ బహురూపి బియ్యం గురించి వర్ణించారు.