విద్యా, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లి స్థిరపడిన వాళ్లను చూశాం. మంచి ఉద్యోగాలు చేస్తూ లైఫ్‌లో సెటిలైన వాళ్ల గురించి విన్నాం. కాని ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన సంజిత్ కొండా అనే యువకుడు ఆస్ట్రేలియాలోని లాట్రోబ్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీలో చేరాడు.(Photo:Instagram)
భారతీయులు ఎక్కువగా ఉండే మెల్బోర్న్ నగరంలోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లోని ఎలిజిబెత్ వీధిలో డ్రాపవుట్ చాయ్‌వాలా అనే టీ కొట్టు ఓపెన్ చేశాడు. సంజిత్ టీ అమ్ముకొని బ్రతుకుతున్నానే ఫీలింగ్ లేకుండా హ్యాపీగా తాను పెట్టుకున్న టీ షాప్‌ని ఎలా అభివృద్ధి చేయాలి..? కస్టమర్లను ఎలా ఆకట్టుకోవాలి..? వ్యాపారంలో ఎలా నిలదొక్కుకోవాలని ఆలోచించాడు.(Photo:Instagram)
టీ కొట్టు పెట్టిన సంవత్సరంలోనే ఏడాది డ్రాపవుట్ చాయ్వాల షాపు మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగింది. అందుకే ఇప్పుడు తన బ్రాండ్ టీని ఫ్రాంచైజీలుగా మరికొన్ని ఔట్లెట్స్ ఓపెన్ చేసి ఇండియా నుంచి వచ్చే స్టూడెంట్స్‌కి పార్ట్‌టైమ్ జాబ్ ఫెసిలిటీ కల్పిస్తానంటున్నాడు సంజిత్ కొండా.(Photo:Instagram)
పెట్టుబడి, ట్యాక్సులు తీసిన తర్వాత 20శాతం లాభాలు వస్తున్నాయన్నాడు సంజిత్ కొండా. ఆస్ట్రేలియా లాంటి దేశంలో వ్యాపారం చేయడం చాలా సులువైన విషయమంటున్నాడు. మొదట్లో తాను పడ్డ కష్టాల్ని చూసి పేరెంట్స్ భయపడ్డారని ..ఇప్పుడు పది మందికి గర్వంగా చెప్పుకుంటున్నారని అంటున్నాడు సంజిత్ కొండా.(Photo:Instagram)