మరోవైపు తెలుగు క్రికెట్ కామెంటరీ టీమ్’లతో మాట్లాడిన నాని.. టీమిండియా క్రికెట్లరకు తన సినిమాల పేర్లు పెట్టాడు. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు జెంటిల్మెన్ అని టైటిల్ ఇవ్వగా, కింగ్ విరాట్ కోహ్లీకి గ్యాంగ్ లీడర్ పేరు ఇచ్చాడు. ఇక హార్దిక్ పాండ్యాకు అయితే పిల్ల జమీందార్ టైటిల్ ఇచ్చాడు.
[caption id="attachment_1673778" align="alignnone" width="1200"] కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) తో ‘దసరా’ (Nani Keerthy Suresh Dasara ) అనే ఓ మాస్ యాక్షన్ సినిమాను చేస్తోన్నసంగతి తెలిసిందే.కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్గా నటించింది. ఇప్పటికే సెన్సార్ వాళ్లు ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేశారు. ఇప్పటికే ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలైన ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాలో ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో విలన్ పాత్రలో కనిపించనున్నారు.ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. టీజర్, ట్రైలర్‌తో దుమ్ములేపిన దసరాకు ఓ రేంజ్లో బిజినెస్ జరుగింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను దిల్ రాజు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను రూ. 28 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.