Andhra Pradesh: అమరావతి కోసం నందమూరి హీరో పాదయాత్ర.. ఫొటోలు వైరల్
Andhra Pradesh: అమరావతి కోసం నందమూరి హీరో పాదయాత్ర.. ఫొటోలు వైరల్
Amaravati Farmers Padayatra: అమరావతి రైతుల పాదయాత్ర రాజమండ్రి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఇవాళ సినీ నటుడు నందమూరి తారకరత్న పాదయాత్రలో పాల్గొన్నారు. టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి ఈ కార్యక్రమంలో ముందుకు నడిచారు.
ప్రస్తుతం రాజమండ్రి రూరల్‌లో అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. రైతుల మహాపాదయాత్రకు పలు వర్గాల నుంచి మద్దలు లభిస్తోంది. తాజాగా నందమూరి హీరో తారకరత్న కూడా పాదయాత్రలో పాల్గొన్నారు.
2/ 7
నందమూరి తారకరత్న బుధవారం ఉదయం రాజమండ్రి రూరల్‌లో అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొన్నారు. రైతులతో కలిసి కొంతదూరం పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా పాల్గొన్నారు.
3/ 7
అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న
4/ 7
తారకరత్నకు ఘనస్వాగతం పలికిన అమరావతి రైతులు
5/ 7
అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్‌తో రైతులు పాదయాత్ర చేస్తున్నారు. అమరావతి నుంచి అసరవల్లి వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నారు.
6/ 7
సెప్టెంబరు 12 నుంచి అమరావతి నుంచి రైతుల పాదయాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రైతులు, వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గొంటున్నారు.
7/ 7
రైతుల పాదయాత్రకు టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఐ, సీపీఐం పార్టీలు మద్దతు తెలిపాయి. పాదయాత్రలో ఈ పార్టీలకు చెందిన నేతలు కూడా పాల్గొంటున్నారు.