Balayya Sankranthi: ఈ ఏడాది సంక్రాంతి సందడి అంతా జిల్లా కారంచెడులోని కనిపిస్తోంది. అందుకు ప్రధాన కారణం నందమూరి-దగ్గుబాటి కుటుంబాల కలయికే.. ఎప్పుడూ లేనిది బాలయ్య సొదరి పురందేశ్వరి ఇంటికి వచ్చి ఉత్సాహంగా కనిపిస్తున్నారు. రాజకీయంగా ఎప్పటి నుంచి శత్రువులుగా మారిన ఈ ఇద్దరు ఒకే చోట చేరడం.. దానికి తోడు.. బాలయ్య తన కొడుకును కూడా అభిమానుల ముందుకు తీసుకు రావడంతో ఈ సంక్రాంతి మరింత సందడిగా మారింది.
ఇప్పటికే నందమూరి నట వారసులుగా బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ లు సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేస్తున్నారు. తాజాగా బాలయ్య అఖండతో బ్లాక్ బస్టర్ హిట్ కొడితే.. జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తో చరిత్ర తిరగరాసేందుకు ఎదురుచూస్తున్నాడు. దీంతో నందమూరి అభిమానులకు ఈ ఏడాది నిజమైన సంక్రాంతి అనే చెప్పాలి. ఇలాంటి సమయంలో బాలయ్య తనయుడు మోక్షజ్ణను అందరికీ జనంలోకి తీసుకురావడంతో ఉత్సాహం రెట్టింపు అవుతోంది.
చాలా ఏళ్లుగా మెక్షజ్ణ సినీ ఎంట్రీపై ఊహాగానాలు వినిపిస్తున్నా.. అతడు హీరోకు సెట్ అవుతాడా లేదా అనే డౌట్ ఉండేది.. ఎందుకంటే అప్పుడెప్పుడు కొన్ని ఫోటోల్లో చాలా లావుగా కనిపించాడు. దీంతో అభిమానులు ఇక బాలయ్య కొడుకు ఎంట్రీ ఉండదు అంటూ నిరుత్సాహ పడ్డారు. అప్పటి అసలు మోక్షజ్ణ ఎలా ఉంటాడు అన్నది అభిమానులకు కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డారు బాలయ్య...
గుర్రపు స్వారీతోనే వీరి సందడి ఆగిపోలేదు. శనివారం సంక్రాంతి సందర్భంగా కారంచేడులో ఎడ్ల బండిని తోలుతూ బాలకృష్ణ సందడి చేశారు. సంక్రాంతి ప్రత్యేకతను చాటేలా ఒంగోలు జాతి ఎడ్ల బండిపై చర్నకోల చెతబట్టిన బాలకృష్ణ కొద్దిసేపు ఎడ్ల బండి నడిపి సరదాపడ్డారు. బాలయ్య కుమారుడు మెక్షజ్ణ, దగ్గబాటి కుటుంభ సభ్యులను ఎడ్లబండిపై ఎక్కించుకుని ఎడ్ల బండిని తోలుకువెళ్లారు.