Nagarjuna Sagar: నిండు కుండలా నాగార్జున సాగర్.. 14 గేట్లు ఎత్తి నీటి విడుదల
Nagarjuna Sagar: నిండు కుండలా నాగార్జున సాగర్.. 14 గేట్లు ఎత్తి నీటి విడుదల
Nagarjuna Sagar Dam: తెలుగు రాష్ట్రాల్లో నీటి ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. జలాశయాలన్నీ నిండుకుండలా మారాయి. కృష్ణానదిపై ఉన్న జూరాల, శ్రీశైలం డ్యామ్ గేట్లను తెరవగా.. తాజాగా నాగార్జునసాగర్ గేట్లను కూడా తెరిచారు. సాగర్ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు జలకళ సంతరించకుంది. శ్రీశైలం నుంచి భారీగా వరద తరలివస్తుండడంతో సాగర్ నిండుకుండలా మారింది. ఈ నేపథ్యంలో 14 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు.
2/ 4
శ్రీశైలం నుంచి సాగర్‌కు 5.14 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. నాగార్జున సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా. . ప్రస్తుతం 584 అడుగులకు నీరు చేరింది.
3/ 4
శ్రీశైలంతో పాటు నాగార్జునసాగర్ గేట్లు తెరచుకోవడంతో.. ఆ ప్రాజెక్టుల వద్దకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. కృష్ణమ్మ జలసవ్వడులను కళ్లారా వీక్షించేందుకు తరలివెళ్తున్నారు.
4/ 4
ఎగువన ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వస్తోంది. ఇవాళ సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్‌కు లక్ష క్యూసెక్కులు, రేపు సాయంత్ర నాటికి 5 లక్షల వరద వస్తుందని ఏపీ మంత్రి పేర్నినాని తెలిపారు.