ఈ నెల 15వ తేదీన తెలంగాణలోని అశ్వారావుపేట నుంచి జంగారెడ్డిగూడెం బయలుదేరిన ఏపీఎస్ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు.. జంగారెడ్డిగూడెంకు సమీపంలోకి రాగానే జల్లేరువాగులో పడిపోయింది. ఘటనలో డ్రైవర్ తో సహా 10 మంది దుర్మరణం చెందారు. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల కుటుంబాలకు రాష్ట్రప్రభుత్వం రూ.5లక్షలు, కేంద్రం రూ.2లక్షలు, ఆర్టీసీ రూ.2.5 లక్షల పరిహారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రమాదంపై ఇంకా విచారణ కొనసాగుతోంది. (File Photo)