ఈ భేటీలో ప్రభుత్వ పరంగా ప్రస్తావించిన అంశాలతో పాటు కీలకమైన అంశాలపై పేర్ని నాని.. జగన్ తో చర్చించినట్లు తెలుస్తోంది. సినిమా టికెట్ల ధర పెంపు, సినీ పరిశ్రమకు రాయితీలు, థియేటర్లలో వసతులు, సదుపాయాల కల్పన, టికెట్ల ధర పెంపుపై అధ్యయన కమిటీ ఇచ్చిన నివేదికపై సీఎంతో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. (File Photo)
ఇదిలా ఉంటే గత నెల 13వ తేదీన మెగాస్టార్ చిరంజీవి.. తాడేపల్లి వచ్చి సీఎం జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి, సినీ ఇండస్ట్రీకి మధ్య నెలకొన్ని వివాదాల పరిష్కారంతో పాటు సినిమా టికెట్లు, ఇతర కీలక అంశాలపై సీఎంతో చర్చించినట్లు మెగాస్టార్ తెలిపారు. నాలుగు వారాల్లో సమస్యకు పరిష్కారం వస్తుందని కూడా చిరు వెల్లడించారు. (File Photo)
ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమాల నిర్మాతలు కూడా ఈ సమావేశానికి వస్తుండటంతో టికెట్ల ధరల పెంపు, రోజువారీ షోల సంఖ్యపై కీలక చర్చలు జరిగే అవకాశముంది. ఐతే ఇప్పటికే ప్రభుత్వం టికెట్ ధరల నియంత్రణ, షోల సంఖ్యపై సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరించినందున ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. (File Photo)