విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణపై పునరాలోచన లేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిషన్రావ్ కరాద్ వెల్లడించారు. ఈ మేరకు లోక్సభలో మంత్రి భగవత్ కిషన్రావ్.. లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.(ప్రతీకాత్మక చిత్రం)
కరోనా సెకండ్ వేవ్ లో దేశాన్ని ఆదుకోవటంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముందు వరసులో నిలిచిందని కార్మిక సంఘాలు గుర్తుచేస్తున్నాయి. ఆక్సిజన్ అందించి కరోనా రోగుల ప్రాణాలు కాపాడటంలో స్టీల్ ప్లాంట్ కీలక పాత్ర పోషించిందని.. అలాంటి ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే ఆలోచన మానుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)