Chiranjeevi Comments: "పెద్దగా కాదు బిడ్డగా చెబుతున్నా.. అనవసర కామెంట్స్ చేయొద్దు" వారికి చిరంజీవి స్వీట్ వార్నింగ్..!
Chiranjeevi Comments: "పెద్దగా కాదు బిడ్డగా చెబుతున్నా.. అనవసర కామెంట్స్ చేయొద్దు" వారికి చిరంజీవి స్వీట్ వార్నింగ్..!
ఏపీ ప్రభుత్వానికి (AP Government) టాలీవుడ్ (Tollywood) కి మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. సీఎం జగన్ (CM Jagan) తో భేటీ అయిన సంగతి తెలిసిందే. భేటీ తర్వాత చిరంజీవి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అవేంటంటే..!
ఏపీ ప్రభుత్వానికి టాలీవుడ్ కి మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి.. సీఎం జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల అంశంతో పాటు పలు అంశాలపై సీఎంతో చర్చించిన చిరంజీవి.. సానుకూల స్పందన వచ్చినట్లు వెల్లడించారు.
2/ 6
ప్రభుత్వానికి సకాలంలో పన్నులు అందడంతో పాటు ఇండస్ట్రీలోని అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు చిరంజీవి తెలిపారు. ముఖ్యంగా సినీ కార్మికులు, థియేటర్ల యజమానులు కష్టాల్లో పడకుండా చూడాలని కోరినట్లు వెల్లడించారు.
3/ 6
ఇదే సమయంలో ఇటీవల ఏపీ ప్రభుత్వంతో పాటు వైసీపీ నేతలపై టాలీవుడ్ నుంచి తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి కామెంట్స్ రాకుండా అడ్డుకట్టవేసే ప్రయత్నం చేశారాయన.
4/ 6
ఇండస్ట్రీ పెద్దగా కాదు.. బిడ్డగా చెబుతున్నానంటూ.. ఇకపై టాలీవుడ్ నుంచి ఎవరూ తొందరపడిగానీ, ఆందోళనతో గానీ ప్రభుత్వంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ వివాదానికి త్వరలోనే ఫుల్ స్టాప్ పడుతుందని అప్పటివరకు ఓపిక పట్టాలని సూచించారు.
5/ 6
ఇక కొన్ని నెలలుగా సాగుతున్న వివాదానికి రెండు మూడు వారాల్లో ముగింపు ఉంటుందని చిరంజీవి చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలో మార్పులు చేసేందుకు సీఎం సూత్రప్రాయంగా అంగీకరించారని.. కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత సానుకూల నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
6/ 6
టికెట్ ధరలు తగ్గిస్తారా పెంచుతారా అనేదానిపై స్పష్టంగా చెప్పలేనని.. కానీ అందరికీ న్యాయం జరుగుతుందని చిరు అన్నారు. అన్నివర్గాల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చిరంజీవి వెల్లడించారు. అలాగే చిన్న సినిమాలకు లబ్ధికలిగేలా ఐదో షోకి అనుమతించే అవకాశాలున్నాయని మెగాస్టార్ తెలిపారు.