అలాంటిది కట్టుకున్న భార్య తోడబుట్టిన చెల్లెల్ని.. తన చెల్లెలిగా చూడాల్సిన బావ.. మరోలా చూశాడు. అక్కడితో ఆగలేదు. మరింత దారుణానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంద్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావర జిల్లా పాలకోడేరు మండలం విస్సాకోడేరుకు చెందిన యువతికి కొంతకాలం క్రితం భీమవరంకు చెందిన వ్యక్తికి పెళ్లైంది. (ప్రతీకాత్మకచిత్రం)
న్యూడ్ ఫోటోలు ఆన్ లైన్లో పెడతానని బెదిరించి పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల వేధింపులు ఎక్కువవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్తే చెల్లెలి పట్ల అలా ప్రవర్తించడంతో భార్య కూడా అతడిపై మండిపడుతోంది. (ప్రతీకాత్మకచిత్రం)
ఇలాంటి ఘటనే కడప జిల్లాలో చోటు చేసుకుంది. ఓ యువతికి స్థానికంగా ఓ యువకుడు పరిచయమయ్యాడు. పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మంచిన ప్రియుడు ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఇద్దరూ ఏకాంతంగా ఉండగా వీడియోలు తీశాడు. అలాగే యువతిని నగ్నంగా ఫోటోలు కూడా తీసుకున్నాడు. (ప్రతీకాత్మకచిత్రం)
ఈ క్రమంలో యువతి గర్భం దాల్చడంతో విషయాన్ని ప్రియుడికి చెప్పి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. ఐతే ఇప్పుడే పెళ్లి వద్దని ఆమెకు మాయమాటలు చెప్పి బలవంతంగా అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత కూడా ఆమె పెళ్లి చేసుకోవాలని నిలదీసినప్పుడల్లా నగ్న వీడియోలు చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేసేవాడు. ఓ రోజు బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో గత ఏడాది సెప్టెంబర్లో పోలీసులు ఇద్దరికీ పెళ్లి జరిపించారు. (ప్రతీకాత్మకచిత్రం)