చాలా భక్తి శ్రద్ధలతో చిరంజీవి దంపతులు ఈ గోదాదేవి కళ్యాణం జరిపించుకున్నారు. కళ్యాణం తరువాత చిరంజీవి దంపతులకు అర్చకులు ఆశీర్వచనాలతో పాటు తీర్ధ ప్రసాదాన్ని అందజేశారు. ఈ కళ్యాణ వేడుకలకు ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి కుటుంబం సహా దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్తలు పి.పి.రెడ్డి, కృష్ణారెడ్డి, యంపి.వల్లభనేని బాలశౌరిలు సైతం పాల్గొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి వచ్చిన సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో ముద్రించిన కొత్త సంవత్సర క్యాలెండర్, డైరీలను విడుదల చేశారు. మెగాస్టర్ చేతుల మీదుగానే వీటిని ఆవిష్కరించారు. ఈ ప్రారంభోత్సవం తరువాత మాట్లాడిన ఆయన గోదాదేవి కళ్యాణ ఉత్సవం పాల్గొనడం తన అదృష్టమని చిరంజీవి చెప్పారు. తెలుగు ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని కోరుతూ.. సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
స్వామి అర్పించల్సిన పూల మాలలను ముందుగా ఆమె ధరించి తరువాత వాటిని స్వామికి పంపేది. రోజు ఇలాగే చేస్తున్నగోధా దేవిని తండ్రి విష్ణు చిత్తుడు మండలిస్తాడు. ఒక నాడు స్వామి వవిష్ణు చిత్తుడుకి కలలో కనిపించి గోధా దేవి ధరించిన మాలలే తాను ధరించాలి అని భావిస్తున్నట్టు స్వామి తెలిపారు. మరుసటి దినం నుండి విష్ణు చిట్టుడు కూడా స్వామి చెప్పిన విధముగానే చేసేవాడు. కొన్ని సంవత్సారాల తరువాత విష్ణు చిత్తుడు గోధా దేవికి వివాహం చేయవలసినది గా నిర్ణయించుకుంటాడు.
గొదా దేవి శ్రీ రంగ నాథుని తప్ప వేరొకరిని పెళ్లి చేసుకోనని తండ్రి కి చెప్తుంది. ఆ రంగనాథుని పొందడానికి ఆ తల్లి ధనుర్మాస వ్రతం అచరిస్తుంది. 30 రోజుల్లో 30 పాశురాలు రాసి స్వామి కి సమర్పించుకుంటుంది. వాటినే తిరుప్పావై అని అంటారు. 30 రోజుల తరువాత స్వామి ప్రత్యక్షమై ఆమెని వివాహం చేసుకుంటారు శ్రీ రంగం లో ఆమె స్వామి నీ వివాహం చేసుకుంటుంది. పెళ్లి తంతు అవ్వగానే ఆమె గర్భాలయంలో కి వెళ్ళి స్వామిలో అయిక్యం అవుతుంది. ఆ రోజు భోగినే. 30 రోజుల్లో 30 పాశురాలు చదివి భోగి నాడు గోధా కళ్యాణం ను పారాయణం చేస్తే సకల భోగాలు లభిస్తాయి అని విష్ణు పురాణం చెబుతుంది.