హీరో కుటుంబంతో సహా ఒక చిన్నపాపకు అక్షరాభ్యాసం చేసేందుకు ఆలయానికి వచ్చే సన్నివేశాలు, కల్యాణ మండపంలో చిత్రీకరించారు. దీంతో పాటు ఒక స్వామీజీ ప్రవచన సనివేశాన్ని కూడా చిత్రీకరించారు. విశాఖలో మహా సముద్రం సినిమా షూటింగ్ 34 రోజుల పాటు చేశామని, ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. చైతన్య భరద్వాజ్ సంగీతం సమకూర్చారన్నారు.