Maha Shivratri 2022: హిందువుల పండుగలలో మహా శివరాత్రికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శివుడికి అంకితమివ్వబడిన ఈ పండుగ మార్చి 1వ తేదీన అంటే మంగళవారం నాడు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నారు. మహా శివరాత్రి పండుగ ప్రతి ఏటా హిందూ పంచాంగం ప్రకారం, మాఘ మాసంలో బహుళ చతుర్దశి నాడు జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు లింగరూపంలో ఉద్భవించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి.
మహా శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. స్నానం చేసిన తరువాత పూజా గదిని శుభ్రం చేసుకుని శివ ప్రతిష్ట చేయాలి. పార్వతీపరమేశ్వరుల కళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టకరం. ఈ పవిత్రమైన రోజున తనను పూజిస్తే తన పుత్రుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతాని సాక్షాత్తు ఆ శివుడే చెప్పాడన్నది పండితుల మాట.
మహా శివరాత్రి రోజున పూజా విధానాన్ని శ్రీక్రిష్ణుడికి ఉపమన్యు మహర్షి వివరించాడు. ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడిని భక్తులు మూడు విధాలుగా పూజిస్తారంట.. వాటిలో ఒకటి శివపూజ, ఉపవాసం, జాగారణ. వీటిలో ఉపవాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటూ శివనామ స్మరణ చేస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని పండితు చెబుతారు.
అలాగే పురుషుడు శివుని గర్భగుడికి వెళ్లే సమయంలో చొక్కాలకు బదులుగా కండువాలను ధరించాలి. శివరాత్రి రోజు శివలింగానికి కచ్చితంగా జలాభిషేకం చేయాలి అంటున్నారు. అలాగే మహా శివరాత్రి రోజున పేదలకు అన్నదానం, ఇతరుల దాన ధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని సూచిస్తున్నారు. శివుడికి చందనం, విభూదిని పెడితే సరిపోతుందని..అలాగే నాగమల్లి పువ్వులంటే శివుడికి ఎంతో ఇష్టం అంటున్నారు. ఈ పువ్వులతో శివరాత్రి రోజున పూజ చేస్తే.. శివుని అనుగ్రహం దక్కుతుందన్నది భక్తుల నమ్మకం.
చేయకూడని పనులు..
మహా శివరాత్రి వేళ శివలింగానికి తులసి ఆకులను సమర్పించకూడదంట..? అలాగే మహా శివరాత్రి పండుగ రోజున శివ లింగానికి ప్యాకెట్ పాలు సమర్పించకూడదని గుర్తుంచుకోవాలి. ఆవు పాలు మాత్రమే శ్రేష్టమైనవని చెబుతున్నారు. అలాగే శివ లింగానికి అభిషేకం సమయంలో ఉపయోగించే పాల ప్యాకెట్లను నోటితో తెంచి ఆ పాలను అభిషేకం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. శివలింగానికి అభిషేకం సమయంలో స్త్రీలు శివలింగాన్ని ఎట్టి పరిస్థితుల్లో తకాకూడదని పండితులు చెబుతున్నారు.