LOW PRESSURE TURNING INTO CYCLONE AS HEAT WAVE TENSION FOR ANDHRA PRADESH FULL DETAILS HERE PRN VSP
AP Weather Update: తుఫాన్ గా మారనున్న అల్పపీడనం.. ఏపీపై ప్రభావం ఇలా.. వారికి హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎండలు (Summer) మండిపోతున్నాయి. మార్చి నెలలోనే మే నెలను తలపించేలా ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. తుఫాన్ (Cyclone) వస్తుందని చల్లని కబురు వినిపించినా.. అంతలోనే అధికారులు ట్విస్ట్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే మే నెలను తలపించేలా ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 5
ఇదిలా ఉంటే తూర్పు ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఇది ఒకటిరెండు రోజుల్లో తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఐతే దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఉంటుందన్న వారత్లు వినిపిస్తున్నాయి.
3/ 5
ఐతే దీని ప్రభావం భారత భూభాగంపై ఉండదని.. అల్పపీడనం క్రమంగా బర్మా, బంగ్లాదేశ్ దిశగా వెళ్తుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ నౌకా రవాణాకు, డీప్ సీ ఫిషింగుకు మాత్రమే హెచ్చరికలు జారీ చేశారు.
4/ 5
ఇతే తుఫాన్ ప్రభావంతో ఉష్ణోగ్రతు తగ్గే అవకాశం లేదు. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో ఉష్ణోగ్రతలు పెరగటంతో ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద పడే అవకాశం ఉంది. ఉత్తరాది నుంచి వడగాలులు ఎక్కువగా వీచే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 5
ప్రస్తుతం ఏపీలో ప్రతి రోజు 36 నుంచి 41 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం బయటకు వెళ్లాలంటేనే భయపడిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. మూడు రోజుల పాటు వడగాలలు వీచే ప్రమాదముండటంతో ప్రజలు బయటకెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. (ప్రతీకాత్మకచిత్రం)