ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం చికెన్ ధరలు (Chicken Price) ఆకాశాన్నంటుతున్నాయి. కిలో చికెన్ ఏకంగా రూ.300 దాటింది. ఆదివారం (Sunday) వస్తే చికెన్ షాపుకు పరుగులు పెట్టేవారు కాస్త ఆలోచించి వెళ్లాల్సిన పరిస్థితి. కిలో చికెన్ కంటే చేపలు, రొయ్యలే బెటర్ అని అందరూ భావిస్తున్నారు. వేసవి కాలం ప్రారంభమైనప్పటి నుంచి ధర పెరిగిందే తప్ప రూపాయి కూడా తగ్గలేదు. (ప్రతీకాత్మకచిత్రం)
ఇదిలా ఉంటే రానున్న రోజుల్లో ఏపీలో చికెన్ దొరికే పరిస్థితి ఉండకపోవచ్చు. త్వరలోనే కోళ్ల ఉత్పత్తి నిలిచిపోతుందన్న వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో బ్రాయిలర్ కోళ్ల కంపెనీలపై కోళ్ల పెంపకం రైతులు ఆగ్రహంతో ఉన్నారు. కోళ్ల గ్రోయింగ్ ఛార్జీలు పెంచకపోవడంతో సంస్థలతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
గతంలో పౌల్ట్రీ పరిశ్రమను రైతులే నిర్వహించి స్వయంగా కోళ్లను పెంచి హోల్ సేల్ గా మార్కెట్ కు తరలించేవారు. ఐతే కొన్నేళ్లుగా కార్పొరేట్ కంపెనీలు ఎంటరయ్యైయి. రైతులతో ఒప్పందం చేసుకుంటున్న కంపెనీలు.. కోడి పిల్లలు, దాణా, మందులు కంపెనీలే సరఫరా చేసి రైతులకు వాటిని పెంచే బాధ్యతను అప్పగించాయి. అందుకుగానూ కిలోకి రూ.4.50 ఇస్తున్నాయి. ఐతే మొదట్లో ఈధర వర్కవుట్ అయినా.. తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. (ప్రతీకాత్మకచిత్రం)
తొలుత రైతు చెప్పిన ధరకు కోళ్లను కొనుగోలు చేసిన వ్యాపారు.. క్రమంగా హేచరీలు, దాణా కంపెనీలతో కలిసిపోయాయి. కోడిపిల్లలు, దాణా సప్లై చేస్తున్న కంపెనీలే.. తిరిగి కోల్లను తమకే అమ్మాలనేలా పరిస్థితిని మార్చేశాయి. దీంతో మార్కెట్లో చికెన్ ధర ఎంతున్నా.. రైతుకు మాత్రం కిలోకు రూ.4.50 మాత్రమే దక్కుతోంది. కిలో చికెన్ రూ.150 ఉన్నా, రూ.300పలికినా రైతుకు మాత్రం ప్రయోజనం చేకూరడం లేదు. (ప్రతీకాత్మకచిత్రం)
పెరిగిన ధరలకు తగ్గట్లుగా గ్రోయింగ్ ఛార్జీలు పెంచకపోవడంతో వందలాది మంది రైతులు ఈ రంగాన్ని వీడుతున్నారు. దీని కారణంగా తెలంగాణలో రైతులు కోళ్ల పెంపకాని లాక్ డౌన్ వేశారు. దీంతో రేట్లు భారీగా పెరిగాయి. ఇప్పుడు ఏపీలో కూడా అలాంటి పరిస్థితే నెలకొనడంతో ఇక్కడ కూడా ధరలు మరింత పెరిగే ఛాన్సుంది. (ప్రతీకాత్మకచిత్రం)
ప్రస్తుతం ఏపీలో నాలుగు వేలకు పైగా బ్రాయిలర్ కోళ్ల పారాలున్నాయి. ఒక్కో బ్యాంచ్ నుంచి 3.05 కోట్లకు పైగా కోళ్లు మార్కెట్లోకి వస్తుంటాయి. కోడిపిల్లలు ఫామ్ లోకి వచ్చిన రోజు నుంచి కూలీ ఖర్చులు, విద్యుత్ ఛార్జీలు,వ్యాక్సిన్ ఖర్చులు, ఉక, లిఫ్టింగ్ ఖర్చులన్నీ కలిపి తడిసిమోపెడవుతోంది. (ప్రతీకాత్మకచిత్రం)
దీంతో రైతు వచ్చేదానికంటే ఖర్చే ఎక్కువగా అవుతోంది. కోడి పిల్లలు, దాణా, మందులు, ఇతర చార్జీల పేరుతో సంస్థ పెట్టిన ఖర్చులన్నీ లిఫ్టింగ్ సమయంలో లెక్కగడుతున్నారు. కోడి కేజీ బరువు పెరగడానికి రూ.95 మించి ఖర్చయితే ఆ భారాన్ని రైతుపైనే మోపుతున్నారు. 10వేల కోళ్ల బ్యాచ్ ను పెంచితే తమకు రూ.80వేల వరకు నష్టమొస్తోందని రైతులు వాపోతున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)