తాజా పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది శక్తిని పెంచడానికి వివిధ పద్ధతులను అవలంబిస్తున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇఫ్పుడు టమాటాల సహాయం తీసుకోవచ్చు. టొమాటో శరీరంలో విటమిన్ సి లోపాన్ని తీర్చడం ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో టమాటో రసం తాగడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.
ఉదయాన్ని ఖాళీ కడుపుతో టామాటో తింటే.. బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో రెండు గ్లాసుల టమాటా రసం తాగాలి. ఇలా చేయడం వల్ల బరువు త్వరగా తగ్గి, కొద్ది రోజుల్లోనే స్థూలకాయాన్ని దూరం చేసుకోవచ్చు. టమాటా రసం తాగడమే కాకుండా తినడం కూడా మంచిదే. దీనివల్ల చర్మ సమస్యలు కూడా దూరమై మెరుస్తుంది అంటున్నారు నిపుణులు.
మనం చూసే కళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు, కాంతిని పెంచేందుకు పచ్చి కూరగాయలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కంటి చూపును మెరుగుపర్చడానికి ఖాళీ కడుపుతో టమాటాలు తీసుకోవడం ఉత్తమం అంటున్నారు. ఇలా చేయడం వల్ల కళ్లే కాదు చర్మ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అయితే ఈ అంశాలన్నీ కేవలం అవగహన కోసమే.. కచ్చితంగా వైద్య నిపుణుల, సలహాలు, సూచనలు తీసుకోవడం మరిచిపోకండి..