మూత్రకోశ ఇన్ ఫెక్షన్లు, మూత్రపిండంలో రాళ్లను తగ్గించడంలో సహాయపడుతుంది. అన్నిటికన్నా శృంగార శక్తిని పెంచడంలో కొబ్బరి నీరు ఎంతగానో సహకరిస్తుంది అని పెద్దలు చెబుతుంటారు. అందుకే ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఫస్ట్ నైట్ కుముందు కొబ్బరి నీరు తాగిస్తుంటారు. అలాగే మూత్ర, వ్యవస్థలపై థెరపటిక్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.
గర్భవతుల్లో మలబద్దకం, జీర్ణకోశంలో సమస్యలు, గుండెలో మంట సాధారణంగా కనిపిస్తాయి. వీటిని కొబ్బరి నీరు తాగడం ద్వారా అధిగమించవచ్చు. గర్భవతులు, పాలు ఇచ్చే తల్లులు కొబ్బరి నీళ్ళను తరచూ తాగటం మంచిది. వీటిలో ఉండే యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ. వైరల్ లక్షణాలు చిన్నపిల్లల్ని ఇన్ ఫెక్షన్ల నుంచి రక్షించడానికి సహాయపడుతుంది,
హార్ట్ ఫెయిల్యూర్ రిస్కును తగ్గించగలదని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. గుండెజబ్బులకు అధిక రక్తపోటు ప్రధానకారణం. పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు రక్తపోటును తగ్గించడంలో సహకరిస్తాయి. ఈ రెండు ఖనిజాలు గల కొబ్బరి నీరు రక్తపోటును నివారించి, రక్తసరఫరాను మెరుగు చేయడంలో సహకరిస్తుంది. రక్తప్రసరణ తీరు సక్రమంగా ఉండాలంటే తరచూ కొబ్బరి నీళ్లు తాగడం మంచిది.
చేతులు, గోళ్లకు రాసుకుంటే మంచి నిగారింపు సంతరించుకకుంటాయి. కొబ్బరికాయలో 94 శాతం నీరు, చాలా తక్కువ కొవ్వు ఉంటుంది. కొబ్బరి నీటి వినియోగం ఎలుకలలో రక్తపోటు, ట్రైగ్లిజరైడ్ మరియు ఇన్సులిన్ స్థాయిలను తగ్గించినట్లు ఓ అధ్యయనంలో తేలింది. అయితే డయోబెటిక్ తో బాధపడుతున్నవారు ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగకపోవడం కూడా మంచిది.